కుల గణన చేపట్టడం చారిత్రాత్మకం
– విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి
పెద్దపల్లి ప్రతినిది:
Conducting caste census is historic: Errozu Bhikshapati
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కుల గణన చేపట్టడం చారిత్రాత్మకమని విశ్వబ్రాహ్మ ణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి అన్నారు. మంగళవారం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అద్యక్షుడు భిక్షపతి మాట్లాడు తూ ‘మేము ఎంతో మాకు అంతా’ అనే నినాదంతో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని ముఖ్యమం త్రి నిర్ణయించడం హర్షణీయమ న్నారు.గత నాలుగు రోజుల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా నని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వివాదాల జోలికి పోకుండా రాష్ట్ర నాయకులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలకమండలిని నియమించి నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షు డు భీమోజు సురేందర్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లోజు రాజు, జిల్లా గౌరవ అద్యక్షులు ముల్కల గోవర్ధన్ శాస్త్రీ, జిల్లా ప్రదాన కార్యదర్శి రామగిరి రాజమౌళి, వరంగల్ జిల్లా అద్యక్షుడు శృంగారపు వెంకటేశ్వర్లు, పట్టణ అద్యక్షుడు నాగులమల్యాల ప్రసాద్, అబ్బోజు కోటయ్య, నూతి రవిందర్ చారి, గర్రెపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.