ఆర్టిక‌ల్ 370 పై జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో గంద‌ర‌గోళం..

- Advertisement -

ఆర్టిక‌ల్ 370 పై జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో గంద‌ర‌గోళం..

Confusion in Jammu and Kashmir Assembly over Article 370.

            అధికార‌, ప్ర‌తిక్షాల మ‌ధ్య వాగ్వాదం..
శ్రీన‌గ‌ర్‌ నవంబర్ 7
: జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీ లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. ఆర్టిక‌ల్ 370 బ్యాన‌ర్‌ను అసెంబ్లీలో ప్ర‌ద‌ర్శించ‌డం ప‌ట్ల బీజేపీ స‌భ్యులు అభ్యంత‌రం వ్యక్తం చేశారు. ఇంజినీర్ ర‌షీద్ సోద‌రుడు, అవామీ ఇతెహ‌ద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మ‌ద్ షేక్‌.. అసెంబ్లీలో ఆర్టిక‌ల్ 370 బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శించాడు. అయితే ఆ బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శించ‌డం ప‌ట్ల ప్ర‌తిప‌క్ష నేత సునిల్ శ‌ర్మ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీంతో అధికార‌, విప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. ఇరు వ‌ర్గాల ఎమ్మెల్యేలు ఒక‌ర్ని ఒక‌రు తోసుకున్నారు. దీంతో అసెంబ్లీని వాయిదా వేశారు. అధికార‌, విప‌క్ష స‌భ్యులు తీవ్ర స్థాయిలో దూష‌ణ‌లు చేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular