Monday, March 24, 2025

కొత్త రేషన్‌ కార్డులపై గందరగోళం..

- Advertisement -

కొత్త రేషన్‌ కార్డులపై గందరగోళం..

Confusion over new ration cards

హైదరాబాద్ , ఫిబ్రవరి 11, (వాయిస్ టుడే)
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల జారీకి ముందుకు వచ్చింది. ఈమేరకు అర్హులను గుర్తించేందుకు గ్రామ/వార్డు సభలు నిర్వహించింది. జనవరి 26 నుంచి కొత్త రేషన్‌ కార్డుల జారీకి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే మండలానికి ఒక గ్రామంలో ఎంపిక చేసిన అర్హులకు కార్డులు జారీ చేశారు. మిగతావారు మీ సేవ కేంద్రాల్లో దరకాస్తు చేసుకోవచ్చని ఆప్షన్‌ ఇచ్చింది. అయితే దీనిపై గందరగోళం నెలకొంది. అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మీసేవ డైరెక్టర్‌ సివిల్‌ సప్లయ్‌ అధికారులకు లేఖ రాశారు. 24 గంటలు గడవక ముందే తన నిర్ణయం మార్చుకుంది. ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ సమయంలో లిఖిత పూర్వకం దరఖాస్తులు పరిశీలనకే ప్రస్తుతం పరిమితం కావాలని నిర్ణయించింది. దీంతో మీసేవ కేంద్రాలకు పరుగులు పెట్టిన ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఉదయం సైట్‌ ఓపెన్‌ అయి.. ఆ వెంటనే క్లోజ్‌ కావడంతో గందరగోలం నెలకొందికాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన, ప్రజావాణి, ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తాజాగా పౌరసరఫరాల శాఖ  ఈసేవ డైరెక్టర్‌కు కూడా లేఖ రాసింది. కొత్త రేషన్‌ కార్డుల కోసం వచ్చే దరఖాస్తులను తెలంగాణ వ్యాప్తంగా అన్ని మీసేవ కేంద్రాల్లో స్వీకరించాలని లేఖలో పేర్కొంది. ఈమేరకు అదే రోజు రాత్రి 8:30 గంటలకు మీ సేవ వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ ఇచ్చింది. శనివారం ఉదయం వరకు ఆప్షన్‌ ఉంది. శనివారం ఉదయం ఈ ఆప్షన్‌ మాయమైంది. అప్పటికే అర్హులు మీసేవ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. అయితే ఆప్షన్‌ తొలగించిన విషయం తెలియని మీసే వకేంద్రాల నిర్వాహకుల దరఖాస్తుల స్వీకరణకు ప్రయత్నించారు. తర్వాత ఆప్షన తొలగించిన విషయం గుర్తించి విషయం చెప్పడంతో అందరూ నిరాశగా వెనుదిరిగారు. దీనిపై సివిల్‌ సప్లయ్‌ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రజావాణి దరఖాస్తులను మాత్రమే ప్రాసెస్‌ చేస్తామని తెలిపారు. ఈ దరఖాస్తులను మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌ చేయించడం తమ ఉద్దేశమన్నారు. ఇక ఇప్పటికే ఉన్న రేషన్‌ కార్డుల్లో ఏమైనా మర్పులు, చేర్పులు ఉంటే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్