Tuesday, February 17, 2026

మునిసిపల్ ఎన్నికల్లో  విశ్వాసాన్ని నిలబెట్టిన ప్రతి కార్యకర్తకు అభినందనలు: రాంచందర్ రావు  

- Advertisement -

బిజెపి కార్యకర్తలపై దాడులు, హత్యలు జరిగినా పార్టీ సిద్ధాంతాన్ని, దేశభక్తిని ఎప్పటికీ వదల్లేదు
మునిసిపల్ ఎన్నికల్లో  విశ్వాసాన్ని నిలబెట్టిన ప్రతి కార్యకర్తకు అభినందనలు
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్-2026లో రాంచందర్ రావు  
హైదరాబాద్ ఫిబ్రవరి 17

Congratulations to every worker who reposed faith in the municipal elections: Ramchandra Rao
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్-2026 రాష్ట్ర స్థాయి కార్యశాల ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారి అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్తకు శిక్షణ అందించే అతి పెద్ద రాజకీయ శిక్షణ కార్యక్రమంలో ఈ కార్యశాల జరిగింది.ఈ శిక్షణ శిబిరంలో పార్టీ సిద్ధాంతాలపై నాయకులు, కార్యకర్తలకు లోతైన అవగాహన కల్పించడంతో పాటు, దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అలాగే, సైద్ధాంతిక సాధికారతను పెంపొందిస్తూ, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికలను సవివరంగా వివరించారు.ఈ కార్యశాలలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్  , పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్.గౌతం రావు  , వీరేందర్ గౌడ్ గారు, వేముల అశోక్  , రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ  , బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు , సీనియర్ నాయకులు అమర్ నాథ్ సారంగుల  , రాష్ట్ర పదాధికారులు, బిజెపి జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రభారీలు, తదితులు పాల్గొన్నారు. ee సందర్బంగా రామ చంద్రా రావు మాట్లాడుతూ పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్తను సిద్ధాంతపరంగా, రాజకీయంగా, సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్-2026 నిర్వహించబడుతోందని తెలంగాణలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు స్పష్టమైన నిదర్శనమన్నారు..ఈ ఎన్నికల ఫలితాల్లో చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ వంటి కీలక పదవులన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలను సాధించడం గర్వకారణమని,  అలాగే నారాయణపేటలో చైర్ పర్సన్ పదవిని సాధించిన మన పార్టీ నాయకులు ఎంతో కష్టపడి ఆ బాధ్యతను గెలుచుకున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు..ఇక దేశమంతా దృష్టి సారించిన భైంసాలో ఇన్నాళ్లు “ఇది మా గడ్డ” అని చెప్పుకున్న వారి అహంకారాన్ని బద్దలుకొట్టి, భారతీయ జనతా పార్టీ అక్కడ విజయపతాకాన్ని ఎగరవేయడం చారిత్రాత్మక విజయం. ఆ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నానన్నారు..ఇంతటితో ఆగకుండా, కార్యకర్తలందరూ కష్టపడి పార్టీకి అనుకూల వాతావరణాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్మించారనిఅన్నారు.. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక శక్తిగా ఎదుగుతోందన్న విశ్వాసాన్ని ప్రజల్లో బలంగా నాటారు. “తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం” అనే విశ్వాసాన్ని నిలబెట్టిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.ఈ విజయాలు కేవలం ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని నిర్మించడంలో మన కార్యకర్తలు సాధించిన విజయం. ప్రజల్లోనే కాదు, కార్యకర్తల్లో కూడా “తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం” అనే విశ్వాసం బలపడిందన్నారు.ఇటు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది. దాదాపు 14 కోట్ల సభ్యత్వంతో పార్టీ విస్తృతమైన బలాన్ని సంపాదించింది. కానీ ఇది కేవలం 14 కోట్ల సభ్యత్వం మాత్రమే కాదు.. మన అసలైన బలం కార్యకర్తలు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి వరకు.. మన పార్టీలో ప్రతి ఎన్నిక, ప్రతి ప్రక్రియ పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరుగుతుంది.ఇతర పార్టీలను చూస్తే అవి ఎక్కువగా కుటుంబ పార్టీలుగా ఉన్నాయి. వారికి స్పష్టమైన సిద్ధాంతాలు ఉండవు. అధికారం సాధించడమే వారి ఏకైక ధేయం.స్వాతంత్ర్యం తర్వాత భారతీయ జనసంఘ్ గా ప్రారంభమైన ప్రయాణం, ఎన్నో అవరోధాలను దాటుతూ, త్యాగాలతో ముందుకు సాగింది.1980లో భారతీయ జనతా పార్టీగా ఏర్పడిన తరువాత కూడా, కేరళ వంటి రాష్ట్రాల్లో మన స్థితి అత్యంత కఠినంగా ఉండేది. ఆ కాలంలో కమ్యూనిస్టులు పాలించిన కొన్ని రాష్ట్రాల్లో బిజెపి కార్యకర్తలపై దాడులు, హత్యలు జరిగినా కూడా, పార్టీ తన సిద్ధాంతాన్ని, దేశభక్తిని ఎప్పటికీ వదల్లేదన్నారు.. అలాంటి త్యాగాల పునాదిపైనే నేడు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచింది.ఈ శిక్షణ మహాభియాన్ ఉద్దేశం.. ప్రతి కార్యకర్తను సిద్ధాంతపరంగా దృఢంగా తయారు చేయడం, రాబోయే ఎన్నికలకు సంస్థాగతంగా సిద్ధం కావడం, అలాగే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువెళ్లడం లక్ష్యం అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్