మావయ్య, బాబాయ్ కు అభినందనలు
హైదరాబాద్, జూన్ 5
ఏపీ ఎన్నికల ఫలితాలపై అగ్ర నటుడు, నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తమ కుటుంబం నుంచి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందిన ప్రతి ఒక్కరిని జూనియర్ ఎన్టీఆర్ అభినందించారు. ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ వరసలతో పిలుస్తూ అందర్నీ ప్రశంసించారు.ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీగా గెలిచిన శ్రీభరత్ కి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కల్యాణ్ కు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
మావయ్య, బాబాయ్ కు అభినందనలు
- Advertisement -
- Advertisement -