గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ.. పవన్ కళ్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు.
”చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపుతెచ్చుకున్న రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్ దక్కడం సంతోషంగా ఉంది. చరణ్‌కు ఉన్న ప్రేక్షకాదరణ, అతను చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలను గుర్తించి తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం ఈ గౌరవాన్ని ప్రకటించడం ముదావహం. ఈ స్ఫూర్తితో అతను మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలని, మరెన్నో పురస్కారాలు.. మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నా” అని పేర్కొన్నారు. ఏప్రిల్ 13న జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి చరణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలోనే ఆయనకు గౌరవ డాక్టరేట్ అందించనున్నారు.