Friday, February 27, 2026

 కాంగ్రెస్… బిజెపికి మధ్యలో సింహం

- Advertisement -

కాంగ్రెస్… బిజెపికి మధ్యలో సింహం

– పురపోరుకు సమాయత్తం
– కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో మూడో వంతు బి.ఆర్ ఎస్ వారే

– బిఆర్ఎస్ పై ఆసక్తి చూపని పలువురు అభ్యర్థులు
 
– బలంగా కనిపిస్తున్న సింహం
 
– సింహం అభ్యర్థులు ఎంపికలో ఆచుతూచి నిర్ణయం
 
– జాగృతి ప్రచారంతో సింహంకు పెరగనున్న బలం

పెద్దపల్లి

Congress… a lion in the middle of BJP
:
పెద్దపల్లి పుర పోరులో ఆయా పార్టీల నాయకులు తమ ఆ యుధాలను సిద్ధం చేసుకుం టున్నారు. నామినేషన్ల ప్రక్రి య పూర్తి చేసుకున్న ఆయా పార్టీల అభ్యర్థులు తమ బీఫా రాలను ఎన్నికల అధికారుల కు సమర్పించారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది. ఇక రేపటి నుండి అభ్యర్థుల ప్రచారాల్లో తలమునకలై సాగనున్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో ఎవరికి వారే గెలుపు తమదే అన్న రీతిలో ప్రచారాలు సాగిస్తున్నారు. పైకి కనిపించకుండా ఎవరి లెక్క లు వారివే అన్నట్టు వారి వారి ప్రయత్నాల్లో మునిగి తేలుతు న్నారు. ఈ క్రమంలో ప్రధానం గా బిజెపి, కాంగ్రెస్ మధ్య పో టీ ఉంటుందనే విషయాన్ని గ్ర హిస్తే అందులో సింహం గుర్తు ఏఐఎఫ్ బీ అనే పార్టీ వచ్చి చేరింది. బీసీ కార్డుతో ముందు కు వచ్చి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించుకొని గెలుపు ధీమాతో ఉన్న మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ 26 మంది అభ్యర్థులతో నామి నేషన్ వేయించాడు. ఈ పార్టీ ప్రచారం కోసం జాగృతి రాష్ట్ర వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మె ల్సీ కవిత రానున్నారు. కానీ ఒక విషయం ఆలోచన చేస్తే పెద్దపల్లిలో మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తులను చూసి ఓట్లు వేసే సంప్రదాయం ఉంది. ఎక్కువ గా అధికార పార్టీ ఏది ఉంటే దానికే బలం ఉంటుందనేది గత పదేళ్లుగా మనం చూస్తూ నే వున్నాము. కానీ పెద్దపల్లి లో మాత్రం ఎవరికి అవకాశం ఇస్తారో ఎవర్ని తొక్కేస్తారనే విషయం మాత్రం ఇక్కడి ఓటర్ల నిర్ణయమే. గత ఎన్నిక ల అంశాలను పరిశీలిస్తే ఈ విషయం చాలా సూటిగా కనిపిస్తున్నది. ఇక ప్రస్తుత మున్సిపల్ పోరులో మాత్రం కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థు ల్లో మూడోవంతు మంది టిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన వారే. ఇందులో చాలామంది గతంలో చేసిన కొన్ని పొరపా ట్లు, అవినీతి, ప్రజల వద్ద డబ్బులు దండుకోవడం వల్ల వారికి గెలుపు పెద్ద సమస్యగా మారనున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే చాలామంది కాంగ్రెస్ లో చేరి పార్టీ కండువా కప్పుకొని బీఫామ్ టికెట్ పొందారు. అ యితే అప్పటికే టికెట్ ఆశిస్తున్నా కాంగ్రెస్ లోని  చాలామంది అభ్యర్థులు, సీనియర్లు వారి రాకను వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ పక్క బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్ తో పలువురి స్థానాలు కూడా మారాయి. దీనివల్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు విషయంలో భయాందోళనలో వున్నారు. ఇక అసలు విష యానికి వస్తే బిఆర్ఎస్ పైన కొంత వ్యతిరేకత ఉన్నవాళ్లు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఆ బిఆర్ ఎస్ వాళ్లే కాంగ్రెస్ లో చేరడంతో ఇటు బిఆర్ఎస్ కు కాకుండా అటు కాంగ్రెస్ కు కాకుండా సింహాని కి లేదా బిజెపికి ఓట్లు వేసే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయంగా పేర్కోంటున్నా రు. బీజేపీలో ఒక అంశం తీసు కుంటే ఇప్పటికీ వర్గ పోరు, అంతర్గత విభేదాలు నాయకు ల్లో బహిరంగంగానే బయటప డిన సంఘటనలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం బీసీ కార్డు ఉద్యమం బలంగా ఉండటం, దీనికితోడు సింహం గుర్తుపై పోటీ చేసే అభ్యర్థుల్లో కొంత మందికి అన్ని వర్గాల నుండి సానుభూతి, జాగృతి తరుపు న కవిత రావడం ద్వారా కూ డా టిఆర్ఎస్ నుండి ఓట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నా యి. ఇది వారి ఓటు బ్యాంకు కు కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. ఏది ఏమైనా మూడు పార్టీల్లో అభ్యర్థులు కూడా బలంగా ఉండటం గెలుపును నిర్ణయించడం కష్టమే మరి….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్