Saturday, February 14, 2026

కాంగ్రెస్ బిజెపి బి.ఆర్.ఎస్ పార్టీ లకు బీసీలపై చిత్తశుద్ధి లేదు..బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్

- Advertisement -

కాంగ్రెస్ బిజెపి బి.ఆర్.ఎస్ పార్టీ లకు బీసీలపై చిత్తశుద్ధి లేదు..బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్

హైదరాబాద్; జనవరి 16; (వాయిస్ టూ డే)

Congress, BJP, BRS parties have no sincerity towards BCs.. BC Welfare Association National Secretary Banala Ajay Kumar

కాంగ్రెస్ బిజెపి బి.ఆర్.ఎస్ పార్టీ లకు బీసీలపై చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ మండిపడ్డారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలుపై ,అలాగే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో
ఏం.పి. ఆర్.కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ బాబు కేసులు వేసి ఇప్పటికే కొట్లాడుతున్నారని తెలిపారు. దీనిపై ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడడం లేదని ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
బీసీల కోసం కోర్టు లలో పిటిషన్ వేసి పోరాడుతున్నారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని, గతంలో బి.ఆర్.ఎస్. ప్రభుత్వం కూడా బీసీ, ఎస్సీ ఎస్టీలను రాజ్యాధికారం వైపు రాకుండా స్కీముల పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చారని తెలిపారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు తక్కువ శాతం రిజర్వేషన్లు కేటాయించడం లో అన్యాయమని, ఈ ఎన్నికల్లో బీసీలందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు.జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలని బీసీలకు బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని అన్ని పార్టీల నాయకులను ఓడించి. మెజారిటీ స్థానాలను బీసీలు కైవసం చేసుకోవాలని కోరారు.గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ పేరుతో వేలాది ఎకరాలు కబ్జా చేశారని, అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూభారతి పేరుతో వేలాది ఎకరాలు భూమిని కొల్లగొడుతున్నారని, బీసీలను అధికారంలోకి రాకుండా రాష్ట్రంలోని సంపదనంతా అగ్రవర్ణాల దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బీసీలంతా ఏకమై మన సంపదను కాపాడుకోవడానికి రాబోయే తరాలకు మన సంపదను అందించాలంటే ఆర్ కృష్ణన్న నాయకత్వంలో పోరాటానికి సిద్ధం కావాలని, మన రిజర్వేషన్లు సాధించుకొని, తద్వారనే రాజ్యాధికారం సాధించుకోగలుగుతామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్