- Advertisement -
తెలంగాణలో కాంగ్రెస్-బిజెపి దోస్తీ: కెటిఆర్
Congress-BJP friendship in Telangana: KTR
హైదరాబాద్ నవంబర్ 28
కాంగ్రెస్, బిజిపి పార్టీలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా విమర్శించారు.రెండు పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగినా బిజెపి నాయకుల్లో ఒక్కరూ నోరుమెదపరని మండిపడ్డారు.రాజకీయ లబ్ధి కోసం కలిసి పని చేస్తున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో కమలం జాగ్రత్తగా ఉందని దుయ్యబట్టారు. సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా మంచిదంటున్నారని, మూసీ కావాలంటున్నారని.. కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల విద్యార్థులు చనిపోయినా.. రైతు గుండె పగిలినా చప్పట్లు కొడతారని నిప్పులు చెరిగారు కెటిఆర్.
- Advertisement -