రంగారెడ్డి అక్టోబర్ 27 వాయిస్ టుడే ప్రతినిధి: చేవెళ్లలోని శంకర్పల్లి చౌరస్తాలో ఈ నెల 28న సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ ప్రచార సభ నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ తెలిపారు.గురువారం చేవెళ్ల నియోకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ… ఈ నెల 18 నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర 28వ తేదీన చేవెళ్లకు చేరుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సభకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డితో పాటు ఇతర రాష్ట్ర స్థాయి నాయకులందరూ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యక ర్తలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి, ప్రతాపరెడ్డి, మాజీ ఎంపీటీసీ పెంటయ్యగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు రెడ్డి శెట్టి మధుసూదన్ గుప్తా, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జూకన్న శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శంకర్ పల్లి చౌరస్తాలో 28న కాంగ్రెస్ ప్రచార సభ…
Published By Voice Today Team
149
- Advertisement -
- Advertisement -
- Tags
- #upsc #thehinduanalysis #dailycurrentaffairs
- 1st dr. lh hiranandani memorial lecture series
- all time
- atiq ahmeds son asad encounter
- atiq gulam encounter
- atique ahmed
- atique ahmed encounter
- destination
- etv ghantaravam
- fires on congress
- great telangana
- great telangana tv
- latest news in english
- real estate
- residential
- shopping mall
- telangana campaign
- telangana latest news
- telangana results
- time part
- umesh pal murder case
- umesh pal prayagraj news



