- Advertisement -
పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ఎల్బీనగర్, వాయిస్ టుడే: ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించిన తరువాత మధుయాష్కి గౌడ్ శనివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి దిల్ సుఖ్ నగర్ లోని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో, శ్రీ కనకదుర్గ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురిని కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖరరెడ్డి, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ బద్దుల వెంకటేష్ యాదవ్, నాయకులు కె.శశిధర్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -



