Sunday, September 8, 2024

హుస్నాబాద్ గడ్డమీద కాంగ్రెస్ జెండా

- Advertisement -

చిగురుమామిడి మండలంలో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలలో భాగంగా 119 నియోజకవర్గలలో హుస్నాబాద్ నియోజకవర్గం ఓటర్ల నుండి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు 1,00,955 ఓటర్లు ఓటు వేయడం జరిగింది. బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సతీష్ కుమార్ కు 81,611 మంది ఓటర్లు ఓటు వేయడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 19,355 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

చిగురుమామిడిలో గ్రామాల వారీగా కాంగ్రెస్ కు బిఆర్ఎస్ పైన మెజార్టీ ఓట్ల వివరాలు

రామంచలో 225, ముల్కనూర్ 140, రేకొండ 595, పెద్దమ్మపల్లి 321, చిగురుమామిడి 631, లంబాడి పల్లి 76, సీతారాంపూర్ 209, ముదిమాణిక్యం 26, ఇందుర్తి 477, గాగిరెడ్డిపల్లి 201, ఓగులాపూర్ 142, సుందరగిరి 402, బొమ్మలపల్లి 40, ఉల్లంపల్లి 96, కొండాపూర్ 183, నవాబుపేట 441, మొత్తంగా చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో కలుపుకొని 4,215 ఓట్ల మెజారిటీతో పొన్నం ప్రభాకర్ ను చిగురుమామిడి మండల ఓటర్లు ముందంజలో ఉంచడం జరిగింది.

ఎన్నికల ప్రచారం సందర్భంగా పొన్నం మాట్లాడుతూ దశాబ్ద కాలంగా బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రజలు చూశారని, ఒక పర్యాయం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మార్పు తీసుకువస్తామని, ఈ మార్పుతో ప్రజలు గెలుస్తారని పొన్నం ప్రభాకర్ ప్రతి సారి అనడం బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు తీరుపై విమర్శించడం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే ఆరు గ్యారెంటీ పథకాలను తప్పకుండా ప్రజలకు అందిస్తామని ప్రతి సమావేశంలో, రోడ్ షో లో హామీ ఇవ్వడం గత 60 సంవత్సరాల ప్రజల ఆకాంక్షలను నిలబెట్టుట గురించి మీ బిడ్డ ఏ రకంగా తెలంగాణ కోసం పోరాటం చేశాడో మీ అందరికీ తెలుసు ఎక్కడికెళ్లినా తెలంగాణ పోరాటంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా ఎక్కడికి వెళ్లిన తల ఎత్తుకునే విధంగా ఉన్నాను తప్పితే తలదించేటట్లు ఉండలేదని గుర్తు చేశారు. బి ఆర్ ఎస్ యొక్క పథకాలను ఎండగడుతూ కాంగ్రెస్ హయాంలో చేసిన మంచి పనులను ప్రజలకు గుర్తు చేస్తూ, 2023 కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా చిగురుమామిడి మండల ప్రజలు మార్పును కోరుకున్నట్లుగా అర్థమవుతుంది.
చిగురుమామిడి జడ్పిటిసి గీకురు రవీందర్ బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లడం ఇంకా మండల ముఖ్య నాయకులు కాంగ్రెస్ లోకి చేరికలు చేయడం వల్ల కూడా పొన్నం విజయానికి తోడైంది. మరీ ముఖ్యంగా చిగురుమామిడి మండలంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి కాంగ్రెస్ తో పొత్తులో ఉండడం వల్ల కూడా సిపిఐ ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్ధి పోన్నంకు వేయడం, ఇలా అన్ని రకాలుగా ప్రజలు మార్పును కోరుకుంటూ నాయకుల తోడుతో పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుండి భారీ మెజారిటీ తో గెలుపొందారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్