
ఆర్కేపురం డివిజన్ లో పార్టీ కార్యాలయాల ప్రారంభం
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డిలతో కలిసి బుధవారం ప్రారంభించారు. అదే విధంగా పలువురు మహిళలు, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిని చిత్తుగా ఓడిస్తామని అన్నారు. తనను గెలిపిస్తే పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, చిక్కుళ్ల శివప్రసాద్, నల్లంకి ధన్ రాజ్ గౌడ్, జంగారెడ్డి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు