సికింద్రాబాద్
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోంది.. సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలిస్తే, కేంద్రంలో ఆ పార్టీ గెలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.బుధవారం నాడు సికింద్రాబాద్ లో జరిగిన కాంగ్రెస్ సభలో అయన మాట్లాడారు. ఆనాడు దత్తాత్రేయ ని ఓడించి.. అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ లో మూడు రంగుల జెండా ఎగరేశారు. ఆనాడు కేంద్రంలో సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 20ఏళ్ల తరువాత ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి దానం నాగేందర్ మూడు రంగుల జెండా ఎగిరేయబోతున్నారు. మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది. అనుకోని పరిస్థితుల్లో ఆనాడు అంజన్ కుమార్ యాదవ్ కు కేంద్ర మంత్రి పదవి రాలేదు. సికింద్రాబాద్ లో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలుస్తుంది.. కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. దానం నాగేందర్ గెలిచి కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యత నిర్వహించబోతున్నారు. బీజేపీ నాయకులు గెలిచి కేంద్ర మంత్రులయినా హైదరాబాద్ కు చేసిందేంటి..? వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమయితే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నగరానికి చిల్లి గవ్వ తేలేదు. జంట నగరాల్లో మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్. పేద ప్రజలు దానం నాగేందర్ కు అండగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తోంటే సికింద్రాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోందని అన్నారు.
దేశంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. పద్మారావు పరువు తీసేందుకే కేసీఆర్ ఆయన్ను పోటీకి దింపారు. పద్మారావు నామినేషన్ కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదు…? దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు… సికింద్రాబాద్ సీటును కేసీఆర్ బీజేపీ కి తాకట్టు పెట్టారు. బస్తీల్లో ప్రజల కష్టాలు తీరాలంటే సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ ను గెలిపించండి. ప్రభుత్వం మనది.. సంక్షేమం మనది. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం చేసే బాధ్యత మాది. నగరానికి కృష్ణా, గోదావరి జలాలు తెచ్చింది ఎవరో చర్చ పెడదాం. జంట నగరాల దాహార్తిని తీర్చింది ఎవరో చర్చపెడదాం…ఇందుకు కేటీఆర్ సిద్ధమా? బీఆరెస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే.. బీజేపీని ఓడించాలంటే దానం నాగేందర్ గెలవాలి. అనిల్ కుమార్ యాదవ్, దానం జోడెద్దుల్లా నాకు అండగా ఉంటారు.. నగరాన్ని అభివృద్ధి చేస్తారనిఅన్నారు.
ఉద్యోగాలు ఇస్తానని.. ఇండ్లు ఇస్తామని మోదీ మోసం చేశారు. తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టి మోదీ తెలంగాణను అవమానించారు. హిందువుల ఆస్తిని ముస్లింలకు పంచుతారని మోదీ మాట్లాడుతున్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మోదీ ఇలా మాట్లాడటం సరైంది కాదు. ఒకరి ఆస్తి ఇంకొకరికి ఎలా పంచుతారు..? దేవుడు గుడిలో ఉండాలి… భక్తి గుండెల్లో ఉండాలి. లక్ష మెజారిటీతో దానం నాగేందర్ ను గెలిపించండని అన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది
- Advertisement -
- Advertisement -