- Advertisement -
తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
Congress government is committed to the development of the Telugu film industry
సినిమా పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం
హైదరాబాద్ డిసెంబర్ 26
తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. సినిమా పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖులు సిఎం రేవంత్ ను కలిశారు.ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక రూపొందించి సర్కార్ అందజేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలని చెప్పారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలని. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని సిఎం సూచించారు.
- Advertisement -