హైదరాబాద్, డిసెంబర్ 6, (వాయిస్ టుడే): కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కొలువుదీరలేదు.. అప్పుడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యా్ఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏడాది కంటే ఎక్కువ కాలం ఉండకపోవచ్చంటూ వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలే కట్టలేకపోతున్నారు.. పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ ప్రశ్నించారు. బ్యాంకులు కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని.. తెలంగాణను నడపాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమంటూ రాజాసింగ్ పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనంటూ రాజాసింగ్ జోస్యం చెప్పారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ పై విజయం సాధించారు. రాజాసింగ్ కు 80182 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థికి 58725 ఓట్లు పోలయ్యాయి. మొగిలి సునీతకు 6,265 ఓట్లు మాత్రమే వచ్చాయి.