కాంగ్రెస్ కు తీవ్రవాద సంస్థలతో సంబంధాలు
నిజామాబాద్
తీవ్రవాద సంస్థలతో కాంగ్రెస్ కు సంబంధాలు న్నాయని ఆరోపించారు ఎంపీ ధర్మపురి అరవింద్. నిషేధిత సంస్థ సిమి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసిందని చెప్పారు.ఈ ఎన్నికలు బీజేపీ కి టెర్రరిస్టు లకు మధ్య జరుగు తున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయని అన్నారు.సిమి పై 15 టెర్రరిస్టు కేసులు ఉన్నాయని వెల్లడించారు
పీఎఫ్ఐ, సిమి లాంటి సంస్థలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం తో పాటు నిధులు కూడా సమకూ రుస్తున్నాయని చెప్పారు.తీవ్ర వాద సంస్థలకు కాంగ్రెస్ మాతృ సంస్థగా మారిందని మండిపడ్డారు కాంగ్రెస్ వస్తే మళ్ళీ పాకిస్తాన్ బలపడుతుం దని హిందువుల ఉనికి కే ప్రమాధం గా కానుందని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన అరవింద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు