కొత్త ప్రచారంలో కాంగ్రెస్

- Advertisement -
Congress in a new campaign
Congress in a new campaign

హైదరాబాద్, నవంబర్ 11, (వాయిస్ టుడే ):  తెలంగాణలో రాజకీయ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. నేతలంతా ప్రజల్లోకి వెళ్తే..  సోషల్ మీడియా సైన్యాలు..  డిజిటల్ ప్రపంచంలో పొలిటికల్ వార్  చేస్తున్నాయి. మరికొంత మంది వ్యహాత్మకంగా ఇతర పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తూ వినూత్న ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా కొంత మంది హైదరాబాద్‌లో మోదీ తోలు బోమ్మలాటలు  అంటూ కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వైరల్ గా మారింది. బీఆర్ఎస్, ఎంఐఎంలను  తోలుబొమ్మల్లా ఆడిస్తున్న ప్రధాని మోదీ రాజకీయం చేస్తున్నారని ఈ ప్రదర్శన ద్వారా వారు చెప్పదల్చుకు్నారు.   ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బీఆర్ఎస్, ఎంఐఎంలను బీజేపీ చేతిలో కీలుబోమ్మలని తెలియజేసేలా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలను ప్రతిబింబించేలా తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలను తోలుబోమ్మల్లా ఆడిస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది.హైటెక్ సిటీ, బేగంపేట లాంటి అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది.

Congress in a new campaign
Congress in a new campaign
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular