- Advertisement -
గిరిజనుల స్వయం పాలనకు తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్
Congress is pushing for tribal self-governance
నర్సంపేట
పత్తినాయక్ తండా గ్రామపంచాయతిని అమీనాబాద్ లో విలీనం చేయాలనే ప్రతి పాదన ఖండిస్తున్నట్లు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.తండాలు ఆత్మగౌరవం,స్వయం ప్రతిపత్తితో బ్రతకాలనే ఉద్దేశంతో నాడు తండాలను గ్రామపంచాయతీలుగా కేసీఆర్ మార్చారని,అందులో బాగంగానే నర్సంపేట నియోజకవర్గంలో 76 నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసినట్లు వివరించాడు.తండాలకు రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని,వివిద దశల్లో ఉన్న రోడ్డు పనులను వెనక్కి పంపి తండాల అభివృధ్ధిని అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ దే నని పెద్ది విమర్శించారు.ఎమ్మెల్యే సొంత గ్రామంలో పతినాయక్ తండాను విలీనం చేయాలనుకోవడం తండావాసుల ఆత్మగౌరవాన్ని దెబ్పతీయటమే అవుతుంది విమర్శించారు.తండా ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా భయటవారిని తీసుకువచ్చి దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.గ్రామసభ అనేది గ్రామస్తులు,గ్రామ సంబందిత అధికారుల సమక్షంలో జరగాలి,అలాంటిది గిరిజనేతర,నియోజకవర్గ కాంగ్రేస్ నాయకుల సమక్షంలో వారి అభిప్రాయాన్ని తండావాసులపై రుద్దటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.అదికారులు, పోలీసులను అడ్డు పెట్టుకుని గ్రామస్తుల సమ్మతి లేకుండా గ్రామసభ నిర్వహించాలనుకోవడం మూర్కత్వం కాదా అని ప్రశ్నించారు.గిరిజనులు స్వయంపాలన లో బ్రతకడం ఎమ్మెల్యే మాదవరెడ్డికి ఇష్టం లేదా అంటూ విమర్శిస్తూ,మిగిలిన 76 తండా,గ్రామపంచాయతీలను విలీనం చేసి గిరిజనులకు స్వయంపాలనను దూరం చేసే కుట్రకు పాల్పడే కార్యక్రమానికి దారిస్తూరని,గిరిజనలోకం మీకు తగిన గుణపాఠం చెప్పుతారని అన్నారు.కాంగ్రేస్ నాయకులకు పోలీసులు,అదికారులు వంతపాడటం హేయమైన చర్య,గ్రామపంచాయతీల ఉనికి ప్రశ్నార్థకం చేసేదిగా ఎమ్మెల్యే తీరు ఉందని విమర్శించారు.
- Advertisement -