- Advertisement -
దానం నాగేందర్ పై కాంగ్రెస్ సీరియస్ అయిందట. దానం వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తిగా ఉందని సమాచారం అందుతోంది. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ అని చెప్పిందట ఏఐసీసీ కాంగ్రెస్.
అయితే… ముందు ఓకే చెప్పి..ఇప్పటికీ రాజీనామా చేయలేదట దానం నాగేందర్.ఇక ఇటీవల రాజీనామా పై మీడియా కెక్కారు దానం. ఒకవేళ తన ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేయకపోతే.. సికింద్రాబాద్ అభ్యర్థిని మార్చే ఆలోచనకు ఏఐసీసీ వచ్చిందని సమాచారం అందుతోంది. అభ్యర్థిని మార్చాల్సి వస్తే… మళ్ళీ తెరపైకి బొంతు రామ్మోహన్ పేరు రానుంది. ఒకటి, రెండు రోజుల్లో సికింద్రాబాద్ అభ్యర్థిపై క్లారిటీ రానుందట.
- Advertisement -