Sunday, September 8, 2024

కాంగ్రెస్ నేతలు.. బెంగుళూరు నేతలకు గులాములు

- Advertisement -

కేసీఆర్ చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తాయి: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, వాయిస్ టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోతో ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిందని, నాడు ఢిల్లీకి గులాములగా చెలామణీ అయితే.. నేడు బెంగళూరు నేతలకు బానిసలుగా మారారని విమర్శించారు. పి.సి.సి.అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్లను అమ్ముకుంటూ రేటెంత రెడ్డిగా మారాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా వర్తిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తిరస్కరించిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. టిక్కెట్లు అమ్ముకొని బి-ఫామ్ ఇస్తున్నది పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా అడుగు వేస్తుందని వివరించారు. భారతీయ రాష్ట్ర సమితి మరోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటివరకు తెలంగాణ ప్రజల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. గత ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత తమదేనన్నారు. ఇతర రాష్ట్రాలు, ఇతర పార్టీల ఎన్నికల హామీలు, వాటి అమలు తీరుతెన్నులను అధ్యయనం చేసి అన్నివర్గాలను ఆకర్షించేలా హామీలు రూపొందించినట్లు తెలిపారు. 2014లో మేనిఫెస్టోను ముందుగానే విడుదల చేసిన గులాబీ పార్టీ, 2018లో మాత్రం ఎన్నికలకు మూడురోజుల ముందే విడుదల చేసిందన్నారు. ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు 45 రోజుల ముందే మేనిఫెస్టోను ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటివరకు  ఇస్తున్న ఆసరా పెన్షన్‌ రూ.5 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారని తెలిపారు. అంతేకాదు ప్రతి ఏడాది రూ.500 పెంచుతూ ఐదేళ్ల వరకు రూ.5 వేలు చేస్తామన్నారు.

దివ్యాంగుల్లో వెలుగులు నింపేందుకు మరింత చేయూతనివ్వాలని బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించిందన్నారు. దివ్యాంగులకు పింఛను రూ.6వేలకు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారని అన్నారు. దివ్యాంగుల పింఛను తొలి ఏడాది రూ.5వేలకు పెంచుతామన్నారు. ఇక ప్రతి ఏటా రూ.300ల చొప్పున పెంచుతామన్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రైతు భీమా తరహాలో కేసీఆర్‌ బీమా అమలుచేస్తామన్నారు. ఇందుకు కోసం కేసీఆర్‌ భీమా-ఇంటింటికీ ధీమా పథకం తీసుకువస్తున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 93లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రూ.5లక్షల బీమాను ఎల్‌ఐసీ సంస్థ ద్వారా చెల్లిస్తామని తెలిపారు. మహిళల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించారన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతినెలా రూ.3వేలు చొప్పున భృతి చెల్లిస్తామన్నారు. తెల్ల రేషన్‌ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పథకం అమలు చేస్తామన్నారు. తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం అందజేస్తామన్నారు. రైతు బంధు మొత్తాన్ని రూ.16వేలకు దశల వారీగా పెంచుతామన్నారు. తొలి ఏడాది రూ.12వేల వరకు పెంచనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత దశలవారీగా పెంపు ఉంటుందని హామీ ఇచ్చారు. పవర్‌ పాలసీ, అగ్రికల్చర్‌ పాలసీ తదితర పాలసీలన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. అవసరమైన ఉద్దీపనలు ఏయే రంగాల్లో అవసరమో వాటిని కూడా చేసుకుంటూ ముందుకు సాగుతామని, .పెరుగుతున్న గ్యాస్‌ సిలిండర్‌ ధరల నుంచి పేదలకు ఉపశమనం కల్పించేందుకు అర్హులైన పేద కుటుంబాలకు 400 రూపాయలకే సిలిండర్‌ అందిస్తామని మరో హామీ ఇచ్చారన్నారు. ఇక అక్రిడేషన్‌ ఉన్న ప్రతి జర్నలిస్టుకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ అందించనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల తరహాలో కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15లక్షల వరకు ఆరోగ్య భీమా వర్తింపజేస్తామన్నారు. తెలంగాణలో పటిష్ఠంగా అమలవుతున్న రెసిడెన్షియల్‌ స్కూల్‌ వ్యవస్థలోకి అగ్రవర్ణ పేదలకు కూడా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ తెలిపినట్లు వివరించారు. అగ్రవర్గ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 ప్రత్యేక రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని అన్నారు. ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్న పాత పెన్షన్‌ విధానం అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఎన్నికవుందని బలంగా విశ్వసిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు..మేము ఇచ్చే హామీలను మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆరు, ఏడు నెలల్లో అమలు చేస్తామన్నారు. ఈ  కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, సీనియర్ నాయకులు గజ్జల మధుసూధనరెడ్డి, బిచినేపల్లి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, కొప్పుల విఠల్ రెడ్డి, సామ తిరుమల్ రెడ్డి, జిన్నారం విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, సాగర్ రెడ్డి, పద్మ శ్రీనివాస్ నాయక్, చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, భవాని ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్