

వాయిస్ టుడే న్యూస్, మే 14 మేడిపల్లి : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి ఒకటో వార్డు సాయి నగర్ కాలనీలో గత 30 సంవత్సరాల నుండి రోడ్డు ఉంది. ఆ రోడ్డు కబ్జాకు గురైతుందని తెలిసి ఆ ప్రాంతానికి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటో వార్డు కంటెస్టెడ్ కార్పోరేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి మజార్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ శ్రీలత బద్రు నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బర్ల నాగరాజు విచ్చేశారు. అక్కడ జరుగుతున్న కబ్జా గురించి వివరాలు కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. ఆ రోడ్డులో మున్సిపల్ కార్పొరేషన్ వారు వేసిన డ్రైనేజీ పైపులైను కరెంటు లైన్ మరియు వాటర్ లైన్ ఉందని నిత్యం ఆరడుగుల సుమారు 100 కుటుంబాలు ప్రయాణం కొనసాగిస్తారని ఈ రోడ్డును చూసి కాలనీలో అపార్ట్మెంట్లు నిర్మించారని రోడ్డు కబ్జా కు గురి కాకుండా అక్రమంగా రోడ్డుకు అడ్డంగా నిర్మించిన బేస్మెంట్ మరియు కాంపౌండ్ వాల్ తొలగించి ఇచ్చిన పర్మిషన్ క్యాన్సల్ చేసి కాలనీవాసుల రాకపోవులకు ఇబ్బంది లేకుండా చేసి సాయి నగర్ కాలనీవాసులకు న్యాయం చేయాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ త్రిలేశ్వరరావు కి వినతి పత్రం అందజేశారు.



