కాంగ్రెస్ ఎంఐఎం ల ఆధిపత్య పోరు

- Advertisement -

కాంగ్రెస్ ఎంఐఎం ల ఆధిపత్య పోరు
పాతబస్తిలో ఉద్రిక్తత
హైదరాబాద్
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  కాంగ్రెస్ పార్టీ బలమైన ఉనికి నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తోంది. దాంతో.. ఎంఐఎం ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఐదు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. డిసెంబర్ 28 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటు, ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల నుంచి గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. రానున్న జీహెచ్ఎంసీ, లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లు సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular