Thursday, January 15, 2026

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నోటీసులు

- Advertisement -

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నోటీసులు
సూర్యాపేట

Congress notices to cover up corruption

కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు , సిరిసిల్ల క్యాంప్ కార్యాలయం పై దాడి ఘటన పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం మంత్రుల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ కి నోటీసులు. అవినీతితో తమ ప్రతిష్ట దిగజారిందని బీఆర్ఎస్ పై కేసులు పెట్టి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంది.  . ఈడీలో సీఎం పేరు పెట్టినందుకు మోడీ కాళ్ళు పట్టుకునేందుకు నీతి ఆయోగ్ కి వెళ్లారు. గతంలో బహిష్కరించి ఇప్పుడెందుకు వెళ్లారో ఆంతర్యం చెప్పాలి. అందాల పోటీల నిర్వహణలో విఫలమై ప్రపంచం ముందు తెలంగాణ పరువు పోగొట్టారు. తమ అవినీతి పై దృష్టి మరల్చేందుకే మీడియాలో మా పై కధనాలు. కేటీఆర్ విజన్ ఖండతరాలు పాకుతుంటే ఓర్వలేకే కేసులు. కేటీఆర్ విదేశాల్లో జరిగే కార్యక్రమాలకు వెళ్ళకుండా చేయాలనే నోటీసుల కుట్ర. నోటీసుల పేరుతో కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తుందని అన్నారు.
అన్ని రంగాల్లో విఫలమై కాంగ్రెస్ నవ్వుల పాలౌతోంది. క్షేత్ర స్థాయిలో ప్రజల శాపనార్ధాలు వింటే కాంగ్రెస్ నేతలు గుండె పగిలి చస్తారు. ప్రజల్లో పలుచనైన కాంగ్రెస్ మీడియాలో సెన్సేషన్ కావాలని చూస్తున్నారు. ప్రతిపక్షాల పై కేసులు మాని రైతు సమస్యలు , తెలంగాణ నీటి హక్కుల దోపిడీ పై దృష్టి పెట్టాలి. కాంగ్రెస్ చేష్టలతో త్వరలో ప్రజల్లో తిరుగుబాటు ఖాయం. కాంగ్రెస్ పీడను ఎప్పుడు వదిలించుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
సిరిసిల్లలో కేటీఆర్ క్యాంప్ పై దాడి చేయడం చిల్లర పని. ప్రోటోకాల్ పని అధికారులు చూస్తారు కేటీఆర్ కి ఎం పని. సీఎం ఫోటోల పేరుతో హింసకు పాల్పడాలని చూశారు. కేసీఆర్ సైన్యాన్ని బయపెట్టడం ఎవరి తరం కాదు. మీ నాయకులనే ముప్పుతిప్పలు పెట్టి తెలంగాణ తెచ్చినోళ్లం మీరెంత అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్