అప్పు చేసి చిప్ప కూడు కాంగ్రెస్ ఏడాది పాలన ఘనత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Congress' one-year rule despite debt: KTR
తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ఆధీనంలో ఉన్న 400 ఎకరాలనిక తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రూ. 25 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకునే ప్రణాళికల్లో భాగంగా వేలం కోసం ప్రకటన కూడా విడుదల చేసింది. కాగా ఈ భూముల అమ్మకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పు చేసి, పప్పు కూడు నాటి సామెత అని..అప్పు చేసి చిప్ప కూడు నేటి కాంగ్రెస్ ఏడాది పాలన ఘనత అని రాసుకొచ్చారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో అప్పు చేసి 70 లక్షల అన్నదాతలకు అండగా నిలిచి, రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు ఖాతాల్లోకి వేసి రూ.28 వేల కోట్లు రుణమాఫీ, రూ.6 వేల కోట్లతో రైతు బీమా, లక్ష 11 వేల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, పారిశ్రామిక, గృహావసరాలకు 24 కరెంట్.. తో పాటు కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, సీతారామ సాగర్ కట్టి 45 వేల చెరువులు కుంటలు బాగుచేసి. 45 లక్షల మందికి పైగా ఆసరా ఫించన్లతో అండగా నిలిచామని అన్నారు. అలాగే కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కళ్యాణలక్ష్మి, వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు 30 మెడికల్, నర్సింగ్ కాలేజీలు, ఏర్పాటు చేస్తే.. అప్పులు తప్పని కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేశారు. కానీ ఇప్పుడు.. కాంగ్రెస్ 15 నెలల పాలనలో రూ.1.65 లక్షల కోట్లు అప్పు చేసి కూడా.. రుణమాఫీ, రైతుబంధు ఎగ్గొట్టారని, రైతులకు రైతు బీమా లేకుండా చేసి, కరెంటు కోతలు విదిస్తున్నారని, గురుకులాలను గాలికి వదిలేసారని, కాళేశ్వరాన్ని ఎండబెట్టి, పాలమూరు రంగారెడ్డిని పడావుపెట్డారని కేటీఆర్ తన ట్వీట్ లో మండిపడ్డారు. గల్లీలో గాలి మాటలు.. ఢిల్లీకి ధనం మూటలు మోసుడు తప్ప 15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటిని ప్రశ్నించారు. నాడు అప్పులు తప్పని అబాండాలు వేసిన వారే ఇప్పుడు అందినకాడికి అప్పులు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.