Sunday, February 22, 2026

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు

- Advertisement -

బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు శ్రీకాంత్ భీమా

నాగర్ కర్నూల్:  ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారనీ అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు శ్రీకాంత్ భీమా  విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బల్మూర్ మండల పరిధిలోని కొండనాగుల గ్రామంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, గ్రామస్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు అని చెబుతూ పేదలకు నయా పైసా ఇవ్వకుండా వారి ఖాతాలోకి మళ్లించారని, నేటి తెలంగాణ ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు.  గత తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ది చెంది, నేడు దేశంలోనే ముందంజలో ఉందని వివరించారు.ప్రచారానికి ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి కూడా ఓటు కారు గుర్తుకు వేస్తామంటూ అభయనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరుణ నరసింహారావు, డిప్యూటీ సర్పంచ్ యూసుఫ్,గ్రామ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ రావు, మాజీ సింగిల్ విండో  చైర్మన్ చంద్రమోహన్ యాదవ్, రామస్వామి గౌడ్, బిచ్చన్న, కస్తూరి నరసింహ, చింత చందు, రేవల్లి జగదీష్, రేవల్లి సిపాయి, ఉడతనూరు సునీల్, జిబిఆర్ మొహమ్మద్ యువసేన సుల్తాన్, మైనారిటీ నాయకులు ,స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్