నేతలలో సంఘటితం… కెసిఆర్ ఓటమి ఖాయం….
రంగారెడ్డి అక్టోబర్ 28 వాయిస్ టుడే ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్క డంతో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇటీవలె రాహుల్ గాంధీ బస్సుయాత్ర సక్సెస్ కావడం తో ఆ పార్టీ ఆగ్ర నేతలతో యాత్రలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా శనివారం వికారాబాద్, రం గారెడ్డి జిల్లాలో విజయభేరి బస్సు యాత్ర నిర్వహిస్తోంది. వికారాబాద్ జిల్లా తాండూర్, పరిగి, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సభలు ఉండ నున్నాయి. ఈ సభలకు కర్నాటక ఉప ముఖ్య మంత్రి డీకే శివకుమార్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర ఆగ్ర నేతలు హాజరుకానున్నారు.
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రతీ నియోజ కవర్గంపై దృష్టి పెట్టంది. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. నేడు సభలు నిర్వహించే నియోజ కవర్గాల్లో సైతం ఆ పార్టీ బలంగా ఉంది. పరిగి లో డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. చేవెళ్లలో భీం భరత్కు టికెట్ కేటాయించింది. ఇక తాండూర్లో డీసీసీబీ చైర్మెన్ మనోహర్రెడ్డికి టికెట్ దక్కింది.
ఇటీవలె ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పైల్ట్ రోహిత్రెడ్డి గెలిచారు. అనంతరం ఆయన బీఆర్ ఎస్లో చేరారు. దాంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ మూడు నియోజకవ ర్గాలు పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దాంతో ఇక్కడ ఎలాగైనా గెలవాలని పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.
ఆగ్రనేతలతో ప్రచారం
తాండూర్, పరిగి, చేవెళ్లలో పార్టీ ఆగ్ర నేతలతో ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. తాండూర్, పరిగి.. కర్నాటకకు దగ్గర ప్రాంతాలు కావడంతో ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరుకానున్నా రు. అంతేకాకుండా ఇటీవల కాలంలో డీకే తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించే సభలకు డీకే హాజరకానుండడం ఆసక్తి గా మారింది. బీఆర్ఎస్, కాం గ్రెస్ మధ్య కర్నాటక, తెలం గాణ రాష్ట్రాల్లో పాలనపై మా టల యుద్ధం నడుస్తోంది. అయితే వీటికి డీకే నుంచి ఎలాంటి సమాధానం వస్తుం దని, బీఆర్ఎస్ ఆరోపణలను డీకే ఎలా తిప్పికొడుతారని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే డీకే ప్రచారంతో కార్యకర్తల్లో జోష్ నిండనుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.