మధిర నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
మధిర నవంబర్ 21: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు సచ్చేది లేదు.. ఆ పార్టీకి 20 సీట్లే వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌కు మద్దతుగా ప్రసంగించారు.ఇవాళ కాంగ్రెసోళ్లు కొత్త డ్రామా మొదలు పెట్టిండ్రు. కాంగ్రెస్‌లో ఇవాళ డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వాడు గెలిచేది లేదు సచ్చేది లేదు. గ్యారెంటీగా చెబుతున్నా.. మళ్ల గదే 20 సీట్లు. 20 లోపే ఇంకా. ఇవాళ మధిర పర్యటనతో 70 నియోజకవర్గంలో మాట్లాడుతున్నా. నేను ఇంకా 30 నియోజకవర్గాలు వెళ్లాల్సి ఉంది. అయింతా 30 పోతే ఇంకా ఊడ్సుకపోతది కాంగ్రెస్. నేను ఎట్లేట్ల పోతనో.. అట్ల ఊడ్సుకోని పోతున్నది కాంగ్రెస్. ఏం లేదు అంత వట్టిదే డంబాచారం. చాలా బ్రహ్మాండంగా పాత మెజార్టీ కంటే రెండు సీట్లు పెంచుకొని బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.మీరు కమల్ రాజ్‌ను గెలిపిస్తే లాభం జరగుదది కానీ.. ఈ భట్టి విక్రమార్కతో వచ్చేది ఏంది పోయేది ఏంది..? వట్టిగనే మిమ్మల్ని మాయమశ్చీంద్ర చేసి, నాకు ముఖ్యమంత్రి అని చెబుతుండు. ఆ పార్టీ గెలిస్తే కదా ముఖ్యమంత్రి. అదంతా అయ్యే పనికాదు. దళితవర్గం ఒక్క ఓటు కూడా భట్టి విక్రమార్కకు వేయొద్దు. ఈ పట్టి లేని భట్టి విక్రమార్కకు ఓటేస్తే మీకు వచ్చేది ఏంది..? పట్టులేనటువంటి, పట్టించుకోనటువంటి భట్టి విక్రమార్క మనకు చేసేది ఏంది..? ఆయన నియోజకవర్గానికే ఆరు నెలలకు ఒకసారి వస్తడు. చుట్టపు చూపులా వచ్చే మనిషి. అంతే కదా..? అని కేసీఆర్ పేర్కొన్నారు.