హైదరాబాద్: డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ సర్కారు రావడం ఖాయమని, అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ రెండు మూడు రోజుల్లో అడ్డగోలు వ్యవహారాలు చేయొద్దన్నారు. ఈ రెండు మూడు రోజుల్లో కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న బట్టి.. ఆర్ధిక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయొద్దని అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర అధికార పార్టీ కుట్రలు చేసే ప్రమాదం ఉందన్న భట్టి.. ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలు ఏదైనా చేస్తారన్నారు.



