24.9 C
New York
Saturday, July 13, 2024

కాంగ్రెస్  వర్సెస్ గులాబీ

- Advertisement -

కాంగ్రెస్  వర్సెస్ గులాబీ
హైదరాబాద్, ఫిబ్రవరి 7,
కేఆర్‌ఎంబీ వివాదంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ లీడర్లు, కేడర్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మరో అడుగు ముందుకు వేసి సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు.. మంచిర్యాల జిల్లా జన్నారంలో సుమన్ దిష్టి బొమ్మను దహనం చేశారు.అటు బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్ శ్రేణులు బాల్క సుమన్ వ్యాఖ్యలపై నిరసన తెలిపాయి. పట్టణంలోని కాంట చౌరస్తాలో సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇక మంచిర్యాలలోనూ కాంగ్రెస్ శ్రేణులు సుమన్ వ్యాఖ్యలపై ఆందోళన చేపట్టాయి. ఐబీ చౌరస్తా నుండి బెల్లంపెల్లి చౌరస్తా వరకు సుమన్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించాయి. మందమర్రి, లక్సెట్టిపేట, హాజీపూర్‌లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ఇదే రకంగా నిరసనలు తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్. ప్రజలు ఓడించినా బీఆర్‌ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని ఆరోపించారు.ఇక హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్‌ క్షమాపణలు చెప్పాలని సికింద్రాబాద్ యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తార్నాకలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారుబాల్క సుమన్‌ నథింగ్‌ అన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మందుల సామేలు.. ఖబడ్దార్‌ అంటూ బీఆర్‌ఎస్‌ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారుఇక బాల్క సుమన్‌పై కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్‌ శ్రేణులు నిరసన తెలిపాయి. చెన్నూర్‌లో సీఎం రేవంత్‌ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ కేడర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు బాల్క సుమన్‌కు వ్యతిరేకంగా నిరసనలతో మోత పుట్టిస్తోంది టీ కాంగ్రెస్‌..

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!