5 రాష్ట్రాల ఎన్నికలే అంశం
హైదరాబాద్, సెప్టెంబర్ 16: చాలా ఏళ్ల తరువాత హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకాగాంధీ హాజరుకాబోతున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇతర ప్రముఖ నాయకులు వస్తున్నారు. ఖర్గే అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఇదే. కాగా ఈ సమావేశంలో రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలే ప్రధాన ఎజెండాకా చర్చ జరుగుతోందిఈ ఏడాది చివర్లో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారిస్తోందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం ప్రారంభమైందిజ ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పేరుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సారి తప్పకుండా ఎన్నికల్లో గెలిచి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని అనుకుంటోంది.ఇలా ఢిల్లీకి వెలుపల హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించడం చూస్తే ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీకి ఎంత కీలకమో తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ తన 6 హామీలను ప్రకటించనుంది. ఇదిలా ఉంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ కి కీలకంగా మారాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించాలంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రాజస్థాన్, చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది.

ఇండియానే ముఖ్యం
ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి సీట్ల త్యాగాలు పెద్ద లెక్కేముంది.. దేశం ముఖ్యం..”ఇండియా” కూటమి లక్ష్యం అదే అన్నారు సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి.. నాలుగేళ్ల సెలవు తర్వాత, నేను ఏమీ అడగకుండానే పార్టీ అధినాయకత్వం గురుతర బాధ్యతలు ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈసారి రాష్ట్ర ప్రజలు.. కాంగ్రెస్ పార్టీని గెలిపించి బహుమతిగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలిపారు.. అందుకే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తోందన్న ఆయన.. కర్నాటక లో ఘన విజయంతో కాంగ్రెస్ పూర్వ వైభవం పునఃప్రారంభంమైంది. తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడం, తదనంతరం ఏపీలో బలపడడం ఖాయం.. దేశం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే విశ్వాసం నాకుందన్నారు రఘువీరారెడ్డి.కాంగ్రెస్ పార్టీతో సహా “ఇండియా” భాగస్వామ్య పక్షాలు సమిష్టిగా లోకసభ ఎన్నికల్లో విజయం సొంతం చేసుకోవడం ఖాయం అన్నారు రఘువీరా.. “ఇండియా” కూటమి ఐక్యతను చూసి, పోటీగా ఎన్డీఏ కూటమి సమావేశాన్ని బీజేపీ నిర్వహించిందని దుయ్యబట్టారు.. గతంలో ఏనాడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను సంప్రదించని బీజేపీ.. “ఇండియా”ను చూసి భయంతోనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిందని ఆరోపించారు రఘువీరారెడ్డి.. కాగా, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఉన్నత స్థాయి విధాన నిర్ణయాక సంఘం సీడబ్ల్యూసీ సభ్యుడుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి నియామకమైన ఏకైక నాయకుడు రఘువీరారెడ్డి కావడం విశేషంగా చెప్పుకోవాలి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎమ్మెస్సార్ సీడబ్ల్యూసీలో సభ్యులుగా ఉన్న విషయం విదితమే.



