Sunday, September 8, 2024

ఫలించిన బుజ్జగింపులు…. తగ్గిన రెబల్స్

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 15, (వాయిస్ టుడే ): తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలబడిన కాంగ్రెస్ నేతల్ని బుజ్జగించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగి రాజకీయ భవిష్యత్ కు హామీ ఇవ్వడంతో పలువురు తమ నామనేషన్లు ఉపసంహరించుకున్నారు. సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి ని  బుజ్జగించేందుకు వెళ్లిన నేతలకు ఆయన అనుచరులు, కుటుంబసభ్యుల నుంచి నిరసన వ్యక్తమయింది. అయినా అందిరకీ సర్ది చెప్పి ఏఐసీసీ దూతలు రోహిత్ చౌదరి, మల్లు రవి  పటేల్ రమేష్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చించారు. నామినేషన్ విత్ డ్రా చేసుకుని.. పార్టీ ప్రకటించిన అభ్యర్థికి సపోర్ట్ చేయాలని కోరారు. భవిష్యత్‌లో ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అధిష్టానం హామీతో వెనక్కి తగ్గిన రమేష్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుని, దామోదర్ రెడ్డి సపోర్ట్ చేస్తానని ప్రకటించారు.బాన్సువాడలో  టికెట్ ఆశించి భంగపడిన  కాసుల బాలరాజు భంగపడ్డారు. అధిష్టానం టికెట్ నిరాకరించడంతో రెబల్‌గా నామినేషన్ దాఖలు చేసిన చేశారు. ఆయన  ఆత్మహత్యయత్నం కూడా చేసుకున్నాడు. చివరికి  బాలరాజుతో చర్చించిన నేతలు.. నామినేషన్ విత్ డ్రా చేయించగలిగారు.  భవిష్యత్‌లో మంచి పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో బాలరాజు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. జుక్కల్‌లో గంగారాం, వరంగల్ వెస్ట్‌లో జంగా రాఘవ రెడ్డి, డోర్నకల్‌లో నెహ్రు నాయక్, ఇబ్రహీం పట్నంలో దండెం రామిరెడ్డి సైతం నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు.

Consequent Appeasements....Reduced Rebels
Consequent Appeasements….Reduced Rebels

కాంగ్రెస్ కు మద్దతుగా ఎల్బీనగర్ స్వతంత్ర అభ్యర్థి కొమురెళ్లి రాజిరెడ్డి కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నారు.  ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొమురెళ్లి రాజిరెడ్డి   … ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనం ఇస్తామని కాంగ్రెస్ హామీ  ఇవ్వడంతో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కాగా.. సగానికి సగం అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నిన్నటి నుంచి ఇప్పటిదాకా 58 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం.. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. భారీ సంఖ్యలోనే అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దాదాపుగా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా బుజ్జగింపులు, చర్చల నడుమ ప్రధాన పార్టీల రెబల్స్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ నామినేషన్లను విత్‌ డ్రా చేసుకున్నారు. ఎక్కువ మంది రెబల్స్ బరిలో ఉంటే.. హోరాహోరీ పోరు సాగుతున్న  సమయంలో ఓట్ల చీలిక ద్వారా పలువురు జాతకాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా తమకు వ్యతిరేకంగా రెబల్స్ బరిలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో అన్ని పార్టీలు సక్సెస్ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ ముందుగానే టిక్కెట్లు ప్రకటించి ఉండేవారు ఉండండి.. పోయేవాళ్లు పొమ్మని సందేశం ఇవ్వడంతో చాలా మంది సర్దుకున్నారు. కాంగ్రెస్ పార్టీకే చివరి వరకూ సమస్యగా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్