జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాటం: పి జె ఏ.
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (వాయిస్ టుడే బ్యూరో)
జర్నలిస్టుల సమస్యలు పరిష్కారంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయని ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పిజేఏ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జర్నలిస్ట్ లకి ప్రత్యేక రక్షణ చట్టం రూపొందించి అమలు చేయాలని,
జర్నలిస్టులకు రావలసిన న్యాయమైన డిమాండ్లలో అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని,
జర్నలిస్ట్ లకి హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆసుపత్రిలో చెల్లుబాటు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని, కరోనా సమయంలో నిలిపివేసిన రైల్వే పాసులను పునరుద్ధరించాలని, అక్రిడేషన్ తో, సంబంధం లేకుండా జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందించాలని, జర్నలిస్టుల పక్షాన పని చేయాల్సిన సంఘాలు యాజమాన్యాలకు, తొత్తులుగా పని చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, ఎన్నికలకు ముందు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో జర్నలిస్ట్ సంఘాలను ఐక్యం చేసి సమరశీల పోరాటాలు నిర్వహించనున్నట్లు వీరాంజనేయులు తెలిపారు.



