ప్రజల సౌకర్యార్థం పన్నూరు వాగుపై బ్రిడ్జి నిర్మించండి.
Construct a bridge over the Pannur river for the convenience of the people.
మంత్రి శ్రీధర్ బాబును కోరిన మాజీ ఎంపీటీసీ
కమాన్ పూర్
రామగిరి మండలంలోని
పన్నుర్ వాగుపై ప్రజల సౌకర్యార్థం బ్రిడ్జి ఏర్పాటు చేయాలని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు పన్నూర్ తాజా మాజీ ఎంపీటీసీ చిందం మహేష్ కోరారు.
పన్నూరు వాగు పై బ్రిడ్జి లేక వాగు అవతలి వైపు ఉన్న పొలాలకు మరియు మదన పోచమ్మ ఆలయానికి వేళ్ళే నందుకు వర్షాకాలంలో వాగుపై బ్రిర్డిజి. లేక పొలాల వెళ్లే రైతులు మరియు గుడికి వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయం పై తాజా మాజీ ఎంపీటీసీ చిందం మహేష్ తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించడంతో. శుక్రవారం రామగిరి మండలం పన్నూర్ గ్రామం లో పంచాయతీరాజ్ ఏఈ వర లక్ష్మి ,వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ వాగు వద్దకు వచ్చి ఎస్టిమేషన్ కోసం మెజర్మెంట్ తీసుకోవడం జరిగింది. త్వరితగతిర నిధులు విడుదల చేయాలని మంత్రి శ్రీధర్ బాబును చిందం మహేష్ కోరారు.