Sunday, September 8, 2024

రెండు, మూడు గ్రామాలకు ఒక సబ్ స్టేషన్ నిర్మాణం

- Advertisement -

మంత్రి నిరంజన్ రెడ్డి

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం, ఉప్పల గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను   రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుర్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఆర్ డి ఓ చంద్రకళ, డి ఈ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగానిది కీలకపాత్ర. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రతి చోట విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా లేకుంటే పరిశ్రమలు, వర్తక, వాణిజ్యాలు, గృహావసరాలు, వ్యవసాయం మూలంగా కోట్లాది మందికి ఉపాధి లభించేది కాదు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, ఐటీ, పారిశ్రామిక, చేతివృత్తులలో ఉపాధి లభిస్తున్నదని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో చేసిన పని ఇది. దేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నది. తెలంగాణ దరిదాపులలో కూడా ఇతర రాష్ట్రాలు లేవు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగాన్ని బట్టే అంతగా ప్రజల అవసరాలు తీరుతున్నాయని, అన్ని పనులు జరుగుతున్నాయని అర్ధం. అభివృద్ధి సూచికలో ప్రధానమైనది విద్యుత్. వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలలో తక్కువ వర్షపాతం నమోదయింది. అయినా వర్షాధార పంటలయిన పత్తి, మొక్కలకు ఎలాంటి ఇబ్బంది లేదు. నెల రోజులు ఈ సారి కాలం ఆలస్యమయింది .. రైతులు వ్యవసాయ అధికారుల సూచన మేరకు సాగుచేయాలి. ఆరుతడి పంటల సాగువైపు రైతులు దృష్టి సారించాలనిఅన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్