- Advertisement -
పీపీపీలో రోడ్ల నిర్మాణం…
Construction of roads in PPP...
విజయవాడ, అక్టోబరు 14, (వాయిస్ టుడే)
ఏపీలో రోడ్లను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పీపీపీ మోడల్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు 100 రోజుల ఖరారు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రణాళికను ఖరారు చేసి రెండు నెలల్లో ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందిరాష్ట్రంలోని రోడ్ల నిర్మాణం ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లో జరగనున్నాయి. దీని కార్యాచరణ ఖరారు చేయడానికి ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీ నియమించింది. ఈ కమిటీ కార్యాచరణను ఖరారు చేసి రెండు నెలల్లో ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల డిపార్టమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.రోడ్లు, భవనాలు (ఆర్అండ్‌బీ) డిపార్ట్‌మెంట్, ఏపీ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్‌డీసీ) పీపీపీ పద్ధతిలో రోడ్ల నిర్మాణం కోసం వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. 2024 సెప్టెంబర్ 13న ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్‌డీసీ) మేనేజింగ్ డైరెక్టర్, రోడ్లు, భవనాలు (ఆర్అండ్‌బీ) చీఫ్ ఇంజినీర్ పంపిన లేఖలో ప్రభుత్వం శాఖల వారీగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించిందని తెలిపినట్లు ఉత్తర్వుల్లో సెక్రటరీ కాంతిలాల్ దండే తెలిపారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం రోడ్లు, భవనాల డిపార్ట్‌మెంట్‌కు కేటాయించిన అంశాలలో “రోడ్ల నిర్మాణంలో పీపీపీ విధానం ఆమోదం” ఒకటని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.దీని ప్రకారం రోడ్ల నిర్మాణం కోసం విధానాన్ని 100 రోజుల్లో ఆమోదించాలి. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్‌లో రోడ్ల నిర్మాణం కోసం పీపీపీ పాలసీని సిద్ధం చేయడానికి, ఖరారు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలించిన తరువాత రాష్ట్రంలో ఆర్అండ్‌బీ డిపార్ట్‌మెంట్‌లో రోడ్ల నిర్మాణం కోసం పీపీపీ పాలసీని సిద్ధం చేయడానికి, ప్రణాళికను ఖరారు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం పీపీపీ పాలసీని సిద్ధం చేయడానికి, ప్రణాళికను ఖరారు చేయడానికి ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కన్వీనర్‌గా చీఫ్ ఇంజినీర్ (ఆర్అండ్‌బీ) ఎస్‌హెచ్, ఎండీ, ఏపీఆర్‌డీసీ, సభ్యులుగా ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఆర్అండ్‌బీ) ఎండీఆర్ఎస్, అడ్మినిస్ట్రేషన్, చీఫ్ ఇంజినీర్ (ఆర్అండ్‌బీ) ఎన్‌హెచ్ & సీఆర్ఎఫ్, డిప్యూటీ ఆర్థిక సలహాదారు సురేంద్ర దత్తి, పీపీపీ నిపుణుడు షాలెం రాజు ఉన్నారు. అయితే పాలసీ ఖరారు చేసి కమిటీ నివేదికను రెండు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా చీఫ్ ఇంజినీర్ (ఆర్అండ్‌బీ) ఎస్‌హెచ్ & ఎండీ, ఏపీఆర్‌డీసీ, అండ్ కమిటీ కన్వీనర్‌కు నిర్దేంచారు.సీఎం చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర రహదారులను కూడా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రోడ్లు, భవనాల మంత్రిత్వ శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటి వరకు జాతీయ రహదారులకే పరిమితం అయిన టోల్ టాక్స్, ఇప్పుడు రాష్ట్ర రహదారులకు కూడా వర్తిస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే రోడ్డు ట్యాక్స్ పెరిగి, భరించలేని విధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర రాహదారులపై టోల్‌గేట్లు పెట్టి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తే అదనపు భారమే అవుతుందని వాహనదారులు అంటున్నారు. దీనివల్ల ప్రజలపై భారాలు పడతాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.రాష్ట్రంలో 8,500 కిలో మీటర్ల మేర జాతీయ రహదారులు, 12,653 కిలో మీటర్ల మేర రాష్ట్ర రహదారులు, 32,725 కిలో మీటర్ల మేర జిల్లా రహదారులు ఉన్నాయి. జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రయాణికులకు, వాహన యజమానులకు టోల్ ఛార్జీల భారం పడుతోంది. ఇప్పుడు 12,653 కిలో మీటర్ల మేర ఉన్న రాష్ట్ర రహదారులను పీపీపీ పద్దతిలో చేపట్టి టోల్ వసూలు చేస్తే ప్రజలపై భారం అధికమవుతుంది. 12,653 కిలో మీటర్ల రాష్ట్ర రహదారులు కూడా పీపీపీ పద్దతిలో చేపట్టి టోల్ వసూలు చేసేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం 2016లోనే నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు రాష్ట్రంలో 31 రోడ్లను పీపీపీ పద్దతిలో చేపట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అప్పటికే కరెంటు ఛార్జీలు పెంపు, రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమంతో అది కాస్తా మధ్యలోనే ఆగిపోయింది.అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి చెంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత అది ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు నాటి నిర్ణయాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారని సమాచారం. గతంలో గుర్తించిన 31 రోడ్లలో 14 రోడ్లను 1,000 కిలో మీటర్ల పరిధిలో యుద్ద ప్రాతిపదికన పీపీపీ మోడల్‌లో చేపట్టేందుకు కార్యచరణను రూపొందించాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తాజాగా రోడ్ల నిర్మాణం కోసం పీపీపీ విధానాన్ని ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది
- Advertisement -