ప్రజలు చిరు వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా నిర్మాణాలు:
రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు టెండర్ పూర్తి
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ
Constructions to make it convenient for people and small traders: Government Whip Vemulawada MLA Adi Srinivas
దాదాపు ఒక కోటి 36 లక్షల నిధులతో వీధి విక్రయ మార్కెట్ జోన్ సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణాలకు భూమి పూజ.
హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రజలు చిరు వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా వేములవాడలో వీధి విక్రయ మార్కెట్ జోన్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న వీధి విక్రయ మార్కెట్ జోన్ పనులకు, 56 లక్షల 50 వేల రూపాయలతో పట్టణంలోని 11,12 వార్డుల్లో నిర్మించనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు నిర్మాణానికి ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. వేములవాడ పట్టణంలో ప్రజలకు అందుబాటులోకి బైపాస్ రోడ్డులో కూరగాయల మార్కెట్లో రూ. 80 లక్షలతో 68 కూరగాయల స్టాల్స్ నిర్మిస్తున్నావని తెలిపారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతో ప్రజలు, మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న వారి కోరిక మేరకు నూతన నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు.
ఎండాకాలం, వర్షాకాలం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉన్న విధంగా స్టాల్స్ నిర్మిస్తున్నామని విప్ తెలిపారు. వేములవాడలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రజల అవసరాలకు అనుగుణంగా దుకాణాల సముదాయాలు, మార్కెట్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రూ.56 లక్షల తో సీసీ రోడ్లు సైడ్ డ్రైన్ ల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. వేములవాడ పట్టణంలో ఉన్న 28 వార్డుల్లో ప్రతి వార్డులో రూ. 10 లక్షలతో కనీస అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులను చేపడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.