నిరంతర విద్యుత్.. నీటి ము టేనా!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,ఎమ్మెల్యేల వరకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని హోరెస్తున్న డైలాగులు వాస్తవంలో నీటిమూట లాంటివేనని ,తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు విమర్శించారు.
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తన స్వీయ అనుభవం చెప్పుకొచ్చారు. ఈనెల 4వ తేదీన గురువారం కొమరబండ రెవిన్యూ పరిధిలో ఉన్న తన పామాయిలు తోటలో మందు పిచికారీ చేద్దాం అని ఉదయం 8గం. లకు పనివాళ్లతో సహా వెళ్లగా మధ్యాహ్నం సమయం వరకు కరెంట్ లేదని చెప్పారు. ఉ. 9 గం.ల నుండి విద్యుత్ సిబ్బందికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా కరెంటు రాలేదని చెప్పారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే ముఖ్యమంత్రి మొదలు అధికార పార్టీ నేతలు ఏసి హాళ్ళలో కూర్చోని నిరంతరం కరెంట్ ఇస్తున్నామని గప్పాలు కొడుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారని ఆరోపించారు. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిశ్శబ్దంగా కర్రు కాల్చి ఎలా వాత బెట్టాలో రైతాంగానికి తెలుసని చెప్పారు. రైతు బందు, రుణ మాఫీ విషయంలో రేవంత్ రెడ్డి మొదలు చెప్పినట్లు డిసెంబర్ 9 గడువు వాగ్దానాన్ని నిలబెట్టుకోని కారణంగానే పార్లమెంట్ ఎన్నికల్లో చావు తప్పి కండ్లు లోట్టపోయిన సామెతలా ఫలితాలు వచ్చిన విషయాన్ని పాలకులు గ్రహించి, తమ తీరు మార్చు కొంటే మేలని హితువు చెప్పారు.
నిరంతర విద్యుత్.. నీటి ము టేనా!
- Advertisement -
- Advertisement -