హైదరాబాద్, అక్టోబరు 30, (వాయిస్ టుడే): రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూూ.. రాచకొండ పరిధిలో డ్రగ్స్ పై డేగ కన్నుతో నిఘా ఉంచామని తెలిపారు. పోలీసుల నుండి తప్పించుకోవడాని నిందితులు వ్యూహాత్మకంగ వ్యవహరిస్తున్నారు.. తాజాగా ఘట్కేసర్, మహేశ్వరం పోలీసుల బృందం సంయుక్త ఆపరేషన్ నిర్వహించి మాదక ద్రవ్యాల రాకెట్ ఛేదించారు.. ఈ కేసులో డ్రగ్ ఫెడ్లర్ ను అరెస్ట్ చేయడంతో పాటు 710 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గంజాయి తరలించడానికి వినియోగించిన వాహనాన్ని సీజ్ చేశాం.. నిందితుడు రాజస్థాన్ కు చెందిన సుబాష్ బిష్ణోయ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.డ్రైవర్ గా పనిచేస్తున్న నిందితుడు ఈజీ మనీ కోసం గంజాయి సప్లైను ఎంచుకున్నాడని రాచకొండ కమిషన్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ముందుగా నిందితుడు ఓ డ్రగ్ సప్లయర్ తో పరిచయాలు ఏర్పరచుకుని డ్రగ్స్ సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.. గంజాయి సప్లై కోసం లారీలో ప్రత్యేకంగా ఓ క్యాబిన్ తయారు చేయించాడు.. ఈ కేసులో పట్టుబడటానికి ముందు 500 కేజీల గంజాయిని విజయవంతంగా సప్లై నిందితుడు చేసినట్లు సీపీ తెలిపారు. తాజాగా డ్రగ్ ఫెడ్లర్ సూచనల మేరకు గంజాయి సేకరణకు ఈనెల 24న ఒడిస్సా వెళ్లిన నిందితుడు.. ఒడిస్సా నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి సప్లై చేసేందుకు యత్నించాడు.. మహేశ్వరం, ఘట్కేసర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో పోలీసులకు నిందితుడు చిక్కాడు..
గంజాయి సప్లై చేస్తూ పట్టుబడ్డ నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశాము అని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.SOT ఎల్బీనగర్, మీర్‌పేట పోలీసులతో సంయుక్త ఆపరేషన్.. అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల రాకెట్ గుట్టు రట్టు చేశారు అని రాచకొండ సీపీ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ కు చెందిన నలుగురు నిందితును పోలీసులు అరెస్ట్ చేశారు.. 80 గ్రాముల హెరాయిన్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్ కు చెందిన భన్వర్ లాల్, విష్ణు బిష్ణోయ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు.. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు నిందితులు ముందుగా డ్రగ్స్ కు అలవాటు పడ్డ నిందితులు అనంతరం ఈజీ మనీ కోసం డ్రగ్స్ విక్రయించడం మొదలుపెట్టారు.. భన్వర్ లాల్ డ్రగ్స్ ఫెడ్లింగ్ కోసం ప్లాన్ చేశాడు.. రాజస్థాన్ నుండి డ్రగ్స్ సేకరించి హైదరాబాద్ లో అమ్మడం మొదలుపెట్టారు అని డీఎస్ చౌహాన్ తెలిపారు.డ్రగ్స్ సరఫరా కోసం ఇద్దరూ జువైనల్ ను ఏర్పాటు చేసుకున్నారు అని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు. పక్కా సమాచారంతో మీర్పేట్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా నిందితులను పట్టుకున్నాం.. పరారీలో ఉన్న మరికొందరు నిందితులను త్వరలోనే పట్టుకుంటాం.. పట్టుబడ్డ నిందితులు ఎన్వలప్ లో పెట్టి డ్రగ్స్ సప్లై చేశారు.. నిందితులు మరోవైపు వినియోగదారులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం అని రాచకొండ సీపీ చౌహాన్ వెల్లడించారు.