- Advertisement -
ఖమ్మం: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్య నాయకుల , కార్యకర్తల సమావేశం గందరగోళంలో కొనసాగింది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌద, మాజీ ఎంపి రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు పొడెం వీరయ్య, సంభాని చంద్ర శేఖర్ తదితరులు హజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే అక్కడ గందరగోళం ఏర్పాడింది. కార్యకర్తలు ఒకరినొకరు పోటాపోటిగా నినాదాలు చేసారు. విహెచ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. స్థానిక నాయకులు పేర్లు చెప్పలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చివరకు కార్యకర్తలను శాంతింప చేసారు
- Advertisement -