మహిళలపై దాడులకు పాల్పడిన దోషులను విడిచిపెట్టేదే లేదు: ప్రధాని నరేంద్ర మోడీ
Convicts of attacks on women will not be spared: PM Narendra Modi
హైదరాబాద్:ఆగస్టు 26
మహిళలపై జరిగే నేరాలను క్షమించరాని పాపమని, దోషులను విడిచిపెట్ట బోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోల్‌కతా లోని ఆర్‌జికర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. ముంబై సమీపం లోని బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల బాలికలపై లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఉత్తర మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ‘లఖ పతి దీదీ సమ్మేళనం’లో ప్రధాని ప్రసంగిస్తూ, మహిళ ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
తల్లులు, సోదరీమణులు, కుమార్తెల భద్రతే దేశం ప్రాధాన్యత అని ఆయన అన్నారు. ఎర్రకోట నుంచి ఈ సమస్యను పదే పదే లేవనెత్తాను. దేశం పరిస్థితి ఎలా ఉన్నా, నా సోదరీమ ణుల, కుమార్తెల బాధ నాకు అర్థమవుతాయని మోదీ అన్నారు.
మహిళలపై నేరాలు క్షమిం చరాని పాపమని ప్రతి రాజకీయ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతానని మోదీ అన్నారు. దోషులె వరైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ‘మహిళల పై నేరాలకు పాల్పడే వారికి సహాయకులను కూడా వదిలిపెట్టకూడదు’ అని ప్రధాని మోదీ అన్నారు.
ఆసుపత్రి అయినా, పాఠ శాల అయినా, ప్రభుత్వం అయినా, పోలీస్ స్టేషన్ అయినా ఏ స్థాయిలో నిర్ల క్ష్యం జరిగినా ప్రతి ఒక్కరికీ జవాబుదారీగా ఉండాల న్నారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం మహిళల కోసం చేసిన కృషి స్వాతం త్య్రం వచ్చినప్పటి నుంచి గత ఏ ప్రభుత్వం చేయలేద న్నారు.
ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగిన ‘లఖపతి దీదీ’ ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ, మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు విధిం చేందుకు తమ ప్రభుత్వం చట్టాలను పటిష్టం చేస్తోంద న్నారు.
2014 సంవత్సరం వరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.25 వేల కోట్ల లోపే రుణాలు ఇవ్వగా, గత 10 ఏళ్లలో రూ.9 లక్షల కోట్లు రుణాలు ఇచ్చామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు.