జాతీయ ఓటర్ల నమోదు కార్యక్రమం పై ఆశా కార్యకర్తల తో సమావేశం
వాయిస్ టుడే వరంగల్ జిల్లా బ్యూరో : వరంగల్ జిల్లా కలెక్టర్ , మెజిస్ట్రేట్ ఆదేశాల అనుసార ప్రకారము DM &HO డాక్టర్. కె. వెంకటరమణ సూచనల మేరకు వైద్య మరియు ఆరోగ్యశాఖ వరంగల్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఈదురు అనిల్ కుమార్ జాతీయ ఓటర్ల నమోదు కార్యక్రమం పై ఆశా కార్యకర్తలకు నేడు ఇన్నర్ వీల్ ఫంక్షన్ హాల్ కొత్తవాడ నందు నిర్వహించడం జరిగినది.అనిల్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి ఉన్న లేనివరంత కూడా ఫామ్ 6 లో నమోదు చేసుకోవాలని ఏమైనా స్థల మార్పిడి గాని, పేరులో లోపాలు గాని ఉన్నట్లయితే ఫామ్ 8 ద్వారా మార్చుకోవాలని, దీనిని సులభంగా మీ మొబైల్ యాప్ లో లేదా మీసేవ కేంద్రాలలో మార్చుకోవచ్చునని తెలిపినారు .ఈ ఓటర్ నమోదు కార్యక్రమము సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని కాబట్టి ఓటు లేని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి వారి పేరు నమోదు చేసుకోవడానికి సహకరించాలని, ప్రతి ఉద్యోగి ధర్మం గా భావించాలని , భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ప్రజాస్వామ్యంలో ఓటు విలువ పవిత్రమైనదని దానిని ఉపయోగించి మంచి ప్రభుత్వాలను ఏర్పరచుకొని దేశాభివృద్ధికి, వ్యక్తి అభివృద్ధికి మన వంతు సేవ అందించడానికి గ్రామాలలో పట్టణాలలో ప్రజలను చైతన్యపరిచి ,ఓటింగ్ తేదీ రోజు ప్రతి ఒక్కరినీ ఓటింగ్ లోపాల్గొనేటట్లు చూడాలని, ఓటుపై ప్రజలకు అవగాహన కల్పించడం సులభము ఈ చిన్న బాధ్యతను ప్రతి ఉద్యోగి అవగాహన కల్పించి ప్రజాస్వామ్యాన్ని గౌరవంగా భావించి మన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరినారు.ఈ కార్యక్రమం లో , డిప్యూటీ డెమో నవీన్ రాజ్ కుమార్, సూపర్వైజర్లు రఘు, మరియు 350 మంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



