Friday, March 20, 2026

ఫ్రీ గా కార్పొరేట్ తరహా వైద్యం

- Advertisement -

హైదరాబాద్ సెప్టెంబర్ 19; ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావుఅన్నారు. ఎంఎన్‌జీ ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్‌ను హరీశ్ రావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టం (రూ.32 కోట్లు), లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ (రూ.50 లక్షలు) ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఎమ్ఎన్ జే ఆసుపత్రిలో 3 ఆపరేషన్ థియేటర్లు మాత్రమే ఉండేవని, అవి కూడా దాదాపుగా 60 సంవత్సరాలు క్రితం నిర్మించినవని, కొత్త వాటిని నిర్మించాలనే ఆలోచన గత ప్రభుత్వాలకు రాలేదని మంత్రి హరీశ్‌ వెల్లడించారు. అంతేకాదు ఓటి కాంప్లెక్స్ లో సరైన వసతులు లేవని, సరైన వెంటిలేషన్, సెంట్రల్ ఏసీ లేకపోవడం… ఇలా అనేక సమస్యలు ఉన్నాయని మంత్రి గుర్తు చేసారు.

Corporate-style medicine for free
Corporate-style medicine for free

ఎయిమ్స్‌కు సమానంగా

సీఎం కేసీఆర్ఎ మ్ఎన్ జే ఆసుపత్రి స్వరూపాన్ని మార్చేశారని, 8 అధునాతన రోబోటిక్ సహా ఎనిమిది మాడ్యులర్ థియేటర్లను ఇప్పటికే ప్రారంభించామని హరీశ్ తెలిపారు. రూ. 32 కోట్లతో రోబోటికల్ సర్జికల్ ఎక్వైంట్ సమకూర్చుకున్నాం, పక్కనే మరో 350 పడకలతో కొత్త బ్లాక్ ప్రారంభించుకున్నామని మంత్రి చెప్పారు. మొత్తం 750 పడకల ఆసుపత్రిగా దేశంలో అతిపెద్ద కేన్సర్ ఆసుపత్రిగా రికార్డ్ నెలకొల్పిందని, మన ఎంఎన్ జే అందిస్తున్న సేవలు, ఢిల్లీలోని ఎయిమ్స్ ద్వారా అందిస్తున్న సేవలకు సమానమని మంత్రి వెల్లడించారు. అంతేకాదు దేశంలోనే తొలిసారి ఎం ఎన్ జే అధ్వర్యంలో ఆంకాలజీ స్పెషల్ నర్సింగ్ స్కూల్ త్వరలో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. జిల్లాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి మొబైల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని, మారుమూల ప్రాంతాలకు సైతం మొబైల్ స్క్రీనింగ్ సేవలు చేరువ చేస్తున్నామని హరీశ్ చెప్పారు.

Corporate-style medicine for free
Corporate-style medicine for free

స్టేట్ కాన్సర్ సెంటర్‌గా

ఎంఎన్‌జీ ఆసుపత్రిని రూ. 120 కోట్లతో స్టేట్ కాన్సర్ సెంటర్‌గా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం నిమ్స్, ఎం ఎన్ జేలో ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా ఎముక మూలుగ మార్పిడి (బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్) శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని హరీశ్ వెల్లడించారు. ప్రైవేటులో 25 లక్షల ఖర్చు అయ్యే బొన్ మారో ట్రాన్స్ ప్లాంటేశన్ చికిత్సను పూర్తి ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అంతేకాదుఅవసాన దశలో ఉన్నవారికి సేవలు అందించేందుకు ఉదేశించిన పాలియేటివ్ కేర్ సేవలను 33జిల్లాల్లో ఏర్పాటు చేసుకున్నామని హరీశ్ గుర్తు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్