Saturday, March 14, 2026

హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికలకు కౌంట్ డౌన్….

- Advertisement -

హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికలకు కౌంట్ డౌన్….
20 వార్డుల తుది జాబితా విడుదల గేమ్ చేంజర్ గా మహిళా ఓటర్లు…
వాయిస్ టుడే ప్రతినిధి జనవరి 17 హుస్నాబాద్ ప్రతినిధి

Countdown to Husnabad Municipal Elections….
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది 20 వార్డులకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా విడుదలవడంతో పట్టణ రాజకీయాలపై ఉన్న అస్పష్టత తొలగిపోయింది. వార్డుల వారిగా ఖచ్చితమైన ఓటర్ల సంఖ్యలు ఖరారవడం ద్వారా రాజకీయ పోరు ఎక్కడ ఎంత స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థం కనిపిస్తుంది. ఈ జాబితా విడుదలతో పార్టీలు తమ బలాబలాలను అంచనా వేసే పరిస్థితి ఏర్పడింది ఇప్పటివరకు సాగిన అంచనాలు ప్రచారం మాటల స్థానంలో ఇప్పుడు అధికారిక లెక్కలు కీలకంగా మారాయి అభ్యర్థుల ఎంపిక ప్రచార దిశ వ్యూహాత్మక నిర్ణయాలన్నీ ఫైనల్ ఓటర్ జాబితా ఆధారంగానే రూపుదిద్దుకొని ఉన్న నేపథ్యంలో హుస్నాబాద్ పట్టణం పూర్తిగా ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
“గేమ్ చేంజర్ గా మహిళా ఓటర్లు…”
హుస్నాబాద్ పట్టణ రాజకీయ సమీకరణాల్లో కీలక మలుపు స్పష్టంగా కనిపిస్తుంది ఫైనల్ ఓటర్ జాబితా ఆధారంగా పట్టణంలో మొత్తం19227 ఓటర్లు నమోదు కాగా అందులో పురుష ఓటర్లు 9348 ఉండగా మహిళా ఓటర్లు9348 ఉండడం ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంది సంఖ్యాపరంగా మహిళలే అధిక సంఖ్యలో ఉండడంతో ఈసారి ఎన్నికల్లో గెలుపు ఓటమిని నిర్ణయించే అసలు శక్తి మహిళా ఓటర్ల చేతిలోనే ఉందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతుంది ఇప్పటివరకు ఎన్నికల రాజకీయాలలో పురుష ఓటర్ల ప్రభావం పైనే చర్చ సాగితే ఈసారి ఫైనల్ లెక్కల వ్యూహం పూర్తిగా భిన్నంగా దృశ్యాన్ని చూపిస్తున్నాయి ప్రతి వార్డులో మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండడం కొన్నిచోట్ల పోలీసుల కంటే మహిళల ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది పార్టీల వ్యూహాలను తిరగరాయించే అంశం గా మారింది ఇకపై ప్రచార నినాదాలు అభ్యర్థుల ఎంపిక హామీల రూపకల్పన అన్ని మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకునేలా మారనున్నాయి అనేది హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికలలో మహిళా ఓటరే ఫైనల్ డెసిషన్ తీసుకునే గేమ్ చేజర్గా మారిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.
“టికెట్ల పోరు మొదలు పార్టీల్లో కలవరం…”
ముసాయిదా ఓటర్ల జాబితా పై వచ్చిన అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం ఫైనల్ జాబితా ఖరారడంతో పార్టీలలో టిక్కెట్ల రేసు అధికారికంగా మొదలైంది వార్డుల వారిగా ఖచ్చితమైన లెక్కలు బయటపడడంతో ఎవరికి ఎక్కడ టిక్కెట్టు ఇవ్వాలన్న అంశంపై పార్టీ నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ప్రతి వార్డులో ఓటర్ల జాబితా ఆధారంగా అభ్యర్థుల ఎంపిక తీవ్రకసరత్తు సాగుతుండగా ఆశావహుల్లో ఆందోళన నేతల్లో ఒత్తిడి పెరుగుతుంది ఒకే వారి నుంచి పలువురు బరిలో నిలవడం లెక్కలు తారుమారు కావడం వంటి అంశాలు పార్టీల్లో అంతర్గత చర్చలను వేడెక్కిస్తున్నాయి ఫైనల్ ఓటర్ జాబితా హుస్నాబాద్ పట్టణంలో రాజకీయాలు ఇక రోజుకొక మలుపు తిరిగే దశలోకి ప్రవేశించాయని రాజకీయ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్