
తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం లియో తెలుగు వెర్షన్ విడుదలపై సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది.టైటిల్ వివాదం నేపథ్యంలో డి-స్టూడియోస్ కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన సిటి సివిల్ కోర్టు.. ఈ నెల 20 వరకు లియో తెలుగు వెర్షన్‌ను విడుదల చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై తెలుగు నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అనుకున్న సమయానికే లియో విడుదల అవుతుందని స్పష్టం చేశారు.తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చిందని,తెలుగులో లియో టైటిల్ ని ఒకరు రిజిస్టర్ చేసుకున్నారని,తమను సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారని,టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నామని,సమస్య పరిస్కారం అవుతుందని,విడుదలలో ఎలాంటి మార్పు ఉండదని అక్టోబర్ 19నే తెలుగులో కూడా లియో విడుదల అవుతుందని స్పష్టం చేశారు.



