ప్రజల కోసం పోరాటాలు, త్యాగాలు చేసిన పార్టీ సిపిఐ
CPI is the party that has fought and sacrificed for the people
పల్నాడు జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి కాసా రాంబాబు
నకరికల్లు,
పోరాటాలు త్యాగాలు చేసిన పార్టీ సిపిఐ అని పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నకరికల్లు లోని కాల్వ కట్ట వద్ద గల సిపిఐ కార్యాలయంలో సిపిఐ జెండాను జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ,
గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకి మూడు సెంట్లు స్థలాలు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఇవ్వాలి సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు.నకిరేకల్లు హరిచంద్రపురం ఎత్తిపోతల పథకాన్ని తోరితే గతిన పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు.
నకరికల్లు నరసరావుపేట చిలకలూరిపేట వైయా చీరాల రహదారిని నాలుగు లైన్లుగా విస్తరింప చేయాలి అని అన్నారు.
విద్యుత్ స్మార్ట్ మీటర్లు తొలగించాలంటూ సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు. నకరికల్లు మండల గ్రామాలలో ప్రభుత్వం బిగించిన విద్యుత్ స్మార్ట్ మీటర్లు తొలగించాలంటూ సిపిఐ ఆధ్వర్యంల జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నాయకులు, కార్యకర్తలు సిపిఐ జిందాబాద్, విద్యుత్ స్మార్ట్ మీటర్లు తొలగించాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా సామాన్య ప్రజలపై భారాలు మోపుతుందని అన్నారు. విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలు నడ్డి విరుస్తుందని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని అన్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా గ్రామాలలో పేద ప్రజలకు 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు స్థలము ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గ్రామాలో బిగించిన విద్యుత్ స్మార్ట్ మీటర్లను తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు, సిపిఐ మండల నాయకులు కే. నాగేశ్వరావు, ఎఐటియుసి ఏరియా అధ్యక్షులు ఉప్పలపాటి రంగయ్య, తప్పెట్ల పుల్లయ్య, గాది కుమారి, నారాయణ, మంగమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.