*ప్రజా పంథా పార్టీ
బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి సిపిఐ ఎం ఎల్ ప్రజాపంథా పార్టీ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ పిలుపునిచ్చారు* వాయిస్ టుడే బోధన్ బుధవారం నాడు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది పార్టీ బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన పాల్గొని ప్రసంగిస్తూ గత ఆరు నెలలుగా దేశంలోని మూడు విప్లవ పార్టీలు ఐక్యత చర్చలు కొనసాగిస్తున్నాయని సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా సీపీఐ ఎం ఎల్ ఆర్ఐ పిసిసి సిపిఐ ఎం ఎల్ పార్టీలు ఐక్యమవ్వాలని నిర్ణయించుకున్నాయని అందులో భాగంగానే ఐక్యత మహాసభను మార్చి 3 4 5 తేదీలలో ఖమ్మంలో జరప నున్నామని ఆయన పేర్కొన్నారు పార్టీ కార్యకర్తలు రెండు నెలల పాటు ప్రచారం నిర్మాణ కృషిని కొనసాగించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు నేడు భారతదేశంలో ఫాసిస్ట్ ప్రమాదం పెరుగుతోందని ఈ తరుణంలో విప్లవకారులంతా ఐక్యమై పోరాడాలని ధనవంతులు పెరుగుతున్నారని వ్యవసాయంలో మార్పులు వస్తున్నాయని మారిన పరిస్థితులను అర్థం చేసుకొని విప్లవోద్యమ నిర్మాణానికి పూనుకోవాల్సిన విప్లవకారులు కాలం చెల్లిన పాత విధానాలని అనుసరించటం వల్ల ప్రజలకు దూరమవుతున్నారని అన్నారు మూడు విప్లవ పార్టీలు మారిన పరిస్థితుల కనుగుణంగా విప్లవోద్యమ నిర్మాణానికి పూనుకుంటాయని అందుకోసమే మార్చ్ 3 4 5 తేదీలలో దేశ నిర్దిష్ట పరిస్థితులను చర్చించుకుని ఐక్యమై దేశంలో బలమైన ఉద్యమానికి పునాదులు వేయనున్నాయని ఆయన పేర్కొన్నారు దేశంలో పాలకులు అధికారాన్ని నిలబెట్టుకొనుటకు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విధంగా పార్టీ శ్రేణులు పోరాడాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు పాలకులు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విద్యార్థి యువజన వ్యతిరేక మహిళా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు పి శంకర్ పవర్ బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి ఐ ఎఫ్ టి యూ జిల్లా నాయకురాలు రెహానా బేగం ఏ ఐ పీ కే ఎం ఎస్ ఎం.ఎస్ నాయకులు సిహెచ్ గంగయ్య ఎస్ బాలయ్య పోశెట్టి డి పోశెట్టి పి ఓ డబ్లు నాయకురాలు కవిత ఐ ఫ్ టీ యు నాయకులు కాజా పోశెట్టి శంకర్ ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు*
సిపిఐ ఎం ఎల్ ప్రజాపంథా పార్టీ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ పిలుపునిచ్చారు
- Advertisement -
- Advertisement -