- Advertisement -
విజయవాడ వరద బాధితులకు అండగా సిపిఐపార్టీ విరాళాల సేకరణ
CPI party collection of donations for Vijayawada flood victimsబద్వేలు
విజయవాడ వరద బాధితులకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేల్ పట్టణ సమితి ఆధ్వర్యంలో విరాళాలు సేకరించడం జరిగింది. స్థానిక నెల్లూరు రోడ్డులోని సిపిఐ కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు విరాళాల సేకరణ నిర్వహించడం జరిగింది. బద్వేల్ పట్టణ ప్రజలు విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తున్నారని వారు చేసే సహకారంలో తెలుస్తుందని అండగా నిలబడ్డ బద్వేల్ పట్టణ ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు ఈరోజు సేకరణలో భాగంగా 10,065 రూపాయలు వరద బాధితులకు సహాయం చేశారని ఈ సేకరణ ఇంకా రెండు రోజులు పాటు కొనసాగుతుందని బద్వేల్ ప్రజలు విజయవాడ వరద బాధితులకు అండగా నిలబడి సాధించాలని చెప్పి కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి. వీరశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బాలు. ఏరియా కార్యవర్గ సభ్యులు పివి రమణ. పెంచలయ్య.జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ. ఏఐవైఎఫ్ నాయకులు బండి అనిల్. నవీన్.రాజ్ కుమార్. రమణ.రాజు మధు. మల్లేష్. నాయకులు రమణ. మహిళా సంఘం నాయకులు సలోమీ.కుమారి. నాయకులు ఓబులపతి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




