Sunday, September 8, 2024

కాంగ్రెస్ గెలుపునకు సీపీఎం అడ్డు

- Advertisement -

ఖమ్మం, నవంబర్ 7, (వాయిస్ టుడే ):  మోకాలడ్డారా. సిపిఐ ని ముద్దు చేసి సిపిఎం ని ఎందుకు అడ్డుకున్నారు. గెలుస్తామనే   అతి దీమాతో సిపిఎం ను కాంగ్రేస్ నాయకత్వం కాదనుకుందా.. సిపిఎం అభ్యర్దుల ప్రకటన తరువాత కాంగ్రేస్ వాస్తవం గుర్తించిందా.. వీమపక్షాల పొత్తుల వ్యవహారంలో కాంగ్రేస్ నాయకుల తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుందా. సిపిఎం ను దూరం చేసుకున్న కాంగ్రేస్ ..ఖమ్మం జిల్లాలో మూల్యం చెల్లించుకోనుందా ..  కాంగ్రేస్ గెలుపుకు ఎర్రజెండా అడ్డుగా నిలువనుందా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నం చేస్తున్న కాంగ్రేస్ కు ఎర్రజెండా దెబ్బ రుచి చూసే పరిస్థితి కనిపిస్తుంది.పొత్తుల పేరుతో కాలయాపన చేసి కాంగ్రేస్ తమకు కాంగ్రేస్ పార్టీ తొండి రాజయకీయం చేసిందని సిపిఎం మండిపడుతుంది. కాంగ్రేస్ తీరుతో విసిగిపోయి సిపిఎం 16 స్థానాల్లో అభ్యర్దులను ప్రకటించి కాంగ్రేస్ కు దిమ్మతిరిగేలా వ్యూహ రచన చేస్తుంది. పొత్తుకు మోకాలడ్డిన నాయకుల ఓటమే ద్యేయంగా అభ్యర్దుల ప్రకటన చూస్తే తెలుస్తుంది. ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామని కాంగ్రేస్ నాయకుల ఆశలపై ఎర్ర జెండా రూపంలో నీళ్లు చల్లే పరిస్థితి వచ్చింది. పొత్తులపై హైదరాబాద్ టు హస్తినా పురం చుట్టూ తిప్పుతూ పొత్తుల వ్యవహారం నడిపిన కాంగ్రేస్ ఊరించి ఉడికించి సిపిఐ కి కన్ను గీటి హక్కున చేర్చుకున్న కాంగ్రేస్.సిపిఎం ను దూరం పెట్టడంలో ఖమ్మం జిల్లా కాంగ్రేస్ నాయకుల ప్రమేయం ఉందనే వార్తలతో సిపిఎం నాయకత్వం కాంగ్రేస్ తమ సత్తా రుచి చూపించాలని ఉవ్వీళ్లూరుతుంది.పక్కా ప్రణాలికతో అభ్యర్దులను ప్రకటించి కాంగ్రేస్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది.రాజకీయాల్లో  నాయకులు చేసే వ్యాఖ్యలు అన్ని సందర్బాల్లో పేలవన్న సంగతి కాంగ్రేస్ నాయకులు తెలుసుకోవాలని సిపిఎం దెప్పి పొడుస్తుంది. వామ పక్షాల పట్టును సత్తా పై  భువన గిరి పార్లమెంట్ సభ్యుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి  చులకన చేసి చేసిన వ్యాఖ్యలను ఎర్రజెండా మండిపడుతుంది.. కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీనియర్ కాంగ్రేస్ నాయకులు ఖండించకుండా మౌనం దాల్చడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. స్నేహం కావాలంటూ ఓవైపు ఎర్రజెండాల చుట్టు ప్రదక్షిణ చేస్తున్న  కాంగ్రేస్ నాయకులు నోటి దూలతో కామ్రేడ్స్ పై వ్యాఖ్యలు చేయడమేంటని వామపక్షాలు మండిపడుతున్నాయి.కమ్యూనిస్టుల ఓట్లు కాంగ్రేస్ కు బదిలీ అవుతాయి కాని కాంగ్రేస్ ఓటు సిపిఎం కు బదలాయింపు కావంటు కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు వామ పక్ష నాయకులు తప్పు పడుతున్నారు. కాంగ్రేస్ ఓట్లు బదలాయింపు కావంటే  మీ నాయకత్వ అసమర్దతని సిపిఎం కౌంటరిచ్చింది.. ఎప్పుడు అవాకులు చెవాకులు పేలే కొమటి రెడ్డి చూసుకుని వ్యాఖ్యలు చేయాలని ప్రదాని పదవినే కాదన్న చరిత్ర వామ పక్షాలకు ఉందన్న వాస్తవం గ్రహించాలని సిపిఎం చురకలంటించింది. గోటితో పోయేదానికి గొడ్డలి దాక తెచ్చుకున్నట్లు సిపిఎం అభ్యర్దులను ప్రకటించిన తరువాత కాంగ్రేస్ నాయకుల్లో కాక పుట్టింది. సీనియర్ నాయకుడు జనారెడ్డి. సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తొందర పడకండంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ సిపిఎంను దువ్వుతున్నారు. సిపిఎం పోటీ లో ఉంటే మదిర. పాలేరు. నాగార్జున సాగర్. వైరా. ఇల్లెందు. కొత్తగూడెం.ఖమ్మం.నల్లగొండ ల్లో కాంగ్రేస్ విజాయినికి కత్తెర పడేపరిస్థితి ఉండటంతో కాంగ్రేస్ నాయకుల్లో గాబారా మొదలైంది. కాంగ్రేస్ నాయకులు తొండి రాజకీయం చేసారాని  ఆగ్రహంతో ఉన్న సిపిఎం నాయకత్వం కాంగ్రేస్ అగ్ర నాయకత్వం ఓటమే ద్యేయంగా పావులు కదుపుతు కాంగ్రేస్ వణుకు పుట్టించే దిశగా కదులుతుంది. పాలేరులో పోటీ చేస్తున్న కాంగ్రేస్ ప్రచార కమిటి చైర్మెన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి పోటీగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం ఎన్నికల గోదాలో దిగుతు సవాల్ చేస్తుండటంతో కాంగ్రేస్ కు కష్టకాలమే అన్న మాట వినిపిస్తుంది. మరో వైపు బిఎస్పితో పొత్తుల మంతనాలు చేస్తున్నామని తమ్మినేని చెప్పడం చూస్తే హస్తం విస్తరించకుండా చేసే వ్యూహం తో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది..

పదేళ్ల కాలంగా అధికారానికి దూరంగాఉన్న కాంగ్రేస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాదించాలని కేంద్ర కాంగ్రేస్ నాయకత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంటే  రాష్ట్రంలో నాయకులు వాచాలత్వం ప్రదర్శించడంపై పార్టీలో సహితం అసహనం వ్యక్తం అవుతుంది. వామ పక్షాల అండ లేకుండా  అధికారం హస్త..గతం ..చేసుకోవడం సాద్యం కాదన్నది కాంగ్రేస్ నాయకులు తెలుసుకుంటే మంచిదనే మాట వినిపిస్తుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్