Thursday, December 12, 2024

సిపిఎం పార్టీ పల్నాడు జిల్లా 25వ మహాసభలు జయప్రదం చేయండి

- Advertisement -

సిపిఎం పార్టీ పల్నాడు జిల్లా 25వ మహాసభలు జయప్రదం చేయండి

CPM Party Palnadu District 25th General Assembly

గోడ పత్రికలు ఆవిష్కరించిన సిపిఎం పార్టీ నాయకులు

మాచవరం,
: ప్రజా ఉద్యమాల సారథి సిపిఎం పార్టీ పల్నాడు జిల్లా 25వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ, మాచవరం మండలంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడుగురాళ్ల, మాచవరం మండలాల సమన్వయ కమిటీ కన్వీనర్ తెలగపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరము పోరాడుతూ ,మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సిపిఎం జిల్లా మహాసభలు నరసరావుపేటలో ఈనెల 6 ,7, 8 వ తేదీల్లో జరుగుతున్న సందర్భంగా కార్మిక, కర్షక సోదరులందరూ పెద్ద ఎత్తున జరిగే ర్యాలీ ,బహిరంగ సభలో పాల్గొనాలని కోరుతున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తూ, ప్రైవేటీకరణ హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుందని, ఈ విధానానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి ఉద్యమాలు నిర్వహిస్తుందని, అదేవిధంగా ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంపు, నిత్యాసరవస్తుల ధరలు పెంచి భారాలను మోపుతుందని, వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించుట రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకుండా చేస్తుందని, అదేవిధంగా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు, ఇల్లు నిర్మించి ఇవ్వాలని,  సిమెంటు పరిశ్రమలకు, తీసుకున్న భూముల లో పరిశ్రమలు వెంటనే నిర్మించాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అప్పటివరకు పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులని సాగు చేసుకుని ఇవ్వాలని తదితర డిమాండ్ల కోసం నిరంతరం పోరాడే సిపిఎం మహాసభల్లో పాల్గొనటానికి సిపిఎం పార్టీ రాష్ట్ర పూర్వప కార్యదర్శి కామ్రేడ్ పి .మధు, రాష్ట్ర కార్యదర్శు వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వి. కృష్ణయ్య ,హరికిషోర్ తదితరులు పాల్గొన్నారు. కావున మాచవరం మండలంలోని ప్రజానీకం అందరూ పెద్ద ఎత్తున నరసరావుపేటలో శుక్రవారం జరిగే సిపిఎం ర్యాలీ ,బహిరంగ సభలో పాల్గొనాలని చెప్పారు. మహాసభల గోడపత్రిక ఆవిష్కరించిన వారిలో సిపిఎం మండల నాయకులు గోపిశెట్టి సత్యనారాయణ, షేక్ , సైదా, షేక్ అల్లావుద్దీన్, అబ్దుల్లా , రసూల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్